బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ ఫైమా జీవితంలోని కన్నీటి కష్టాలు వింటే.. కన్నీళ్లు ఆగవు!

ఫైమా పటాస్, జబర్దస్త్ కమెడియన్. మంచి మంచి జబర్దస్త్ స్కిట్లతో పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 1998లో తెలంగాణలోని కామారెడ్డి లో జన్మించింది. వీరిది ఒక నిరుపేద కుటుంబం. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఈమె ఆ కుటుంబంలో నాలుగవ సంతానం. తండ్రి కష్టం పైనే కుటుంబ పోషణ జరుగుతుంది.

కుటుంబంలో అందరూ ఆడపిల్లలే కావడం చేత చిన్నప్పుడు ఫైమాను వేరే వాళ్లకు దత్తత ఇద్దామనుకున్నాడు అంట తండ్రి. కానీ తన అక్కలు ఏదో విధంగా పెంచుకుందాం. ఎవరికి దత్తత ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెబితే తల్లిదండ్రులు సరే అని చెప్పి, తల్లి కూడా కుటుంబ పోషణ కొరకు బీడీలను చుట్టేది.

తల్లితండ్రులు కష్టపడి, కాస్త అప్పుచేసి ఇద్దరు అమ్మాయిలకు వివాహం చేశారు. ఫైమా చదువు కోసం తన మూడవ అక్క కూడా చదువు మానేసి తల్లితో కలిసి బీడీలు చుట్టేది. ఇక ఫైమ కెరీర్ విషయానికి వస్తే పటాస్ షో ప్రారంభంలో వివిధ కాలేజీల నుండి స్టూడెంట్స్ తీసుకువచ్చి కామెడీ చేసేవారు. అలా అనుకోకుండా ఫైమా చదివే కాలేజీ విద్యార్థులు పటాస్ లో పాల్గొంటే తాను కూడా వెళ్ళింది. అక్కడ యాంకర్ రవి, ఫైమా కామెడీ చూసి పటాస్ లో నటిస్తారా అంటూ అవకాశం ఇచ్చాడు.

మొదట్లో ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఫైమ వినకపోవడంతో సరే అన్నారు. ఇక పటాస్ షోలో తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత పటాస్ షోను మూసి వేయడం జరిగింది. కొన్ని రోజులు ఖాళీగా ఉండి జబర్దస్త్ లో పటాస్ కమెడియన్స్ ను తీసుకుంటున్నారని తెలిసి ప్రయత్నించి విఫలం అయింది.

అనుకోకుండా జబర్దస్త్ లో ముక్కు అవినాష్ కెవ్వు కార్తీక్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీం లో కొనసాగుతూ, ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతుంది. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే పటాస్ షోలో ఒక ఎపిసోడ్ కు 5000 వరకు పారితోషకం, జబర్దస్త్ లో 8 వేల నుండి పదివేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.