బిగ్ బాస్ షోలో మనకు ప్రసారమయ్యేది గోరంత.. అక్కడ జరిగేది కొండంత. వారికి నచ్చినట్టుగా, అనిపించినట్టుగా పుటేజ్ మొత్తాన్ని ఎడిట్ చేసి చూపిస్తారు. అందులో కొన్ని రిలేషన్స్ అస్సలు బయటపడవు. అచ్చం నిన్న మెహబూబ్ అభిజిత్ గురించి చెప్పినట్టుగా. నిన్న మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అవుతూ అభిజిత్ గురించి చెప్పిన మాటలు వింటూ అందరికీ ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య అంత మంచి రిలేషన్ ఉందా? అని అందరూ ఆశ్చర్య పడుతున్నారు.
ఇంట్లో నుంచి మెహబూబ్ వెళ్లేటప్పుడు, స్టేజ్ మీదా అభిజిత్‌కు ఒకే మాటలు చెప్పాడు. నువ్ టాస్కులు వంద శాతం ఆడుతావ్.. కానీ నాకు అది వద్దు.. నాకు 200 శాతం కావాలి.. అని అన్నాడు. ఇక స్టేజ్ మీదకు ఎక్కాక మరింత ఎమోషనల్ అయ్యాడు. నాకు తమ్ముడు ఉన్నాడు.. ఇంట్లో అన్ని నేనే చూసుకుంటా.. ఇప్పుడు నాకు అన్న ఉన్నాడు.. అభిజిత్ నా అన్న.. అంటూ మెహబూబూ ఎమోషనల్ అయ్యాడు.
ఫిజికల్ టాస్కులు ఇంకా బాగా ఆడాలని, రోజూ జిమ్‌లో కనిపించాలని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎప్పుడూ కూడా నిబ్బరంగా ఉండే అభిజిత్ కూడా మెహబూబ్ వల్ల ఎమోషనల్ అయ్యాడు. తాను పదేళ్ల క్రితం ఎలా ఉండేవాడినో మెహబూబ్ అలా ఉన్నాడు.. చాలా కష్టపడుతుంటాడు.. ఏం జరిగిందో నాకు తెలీదు కానీ.. ఈ ఇంట్లో ఉండేందుకు మెహబూబ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి అదొక్కనే నేను చెప్పగలను అంటూ అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.