Gallery

Home News ఊపందుకున్న బిగ్ బాస్ సీజన్ 5 ప‌నులు.. వార్త‌ల‌లోకి ఇద్ద‌రు ట్రెండింగ్ బ్యూటీల పేర్లు

ఊపందుకున్న బిగ్ బాస్ సీజన్ 5 ప‌నులు.. వార్త‌ల‌లోకి ఇద్ద‌రు ట్రెండింగ్ బ్యూటీల పేర్లు

బుల్లితెర‌ని షేక్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఇప్పుడు తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఐదో సీజ‌న్‌కు స‌న్న‌ద్ధ‌మైంది. స‌మ్మ‌ర్‌లో ప్రారంభం కానున్న ఈ షోకు సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సీజ‌న్ 5 కంటెస్టెంట్స్ కోసం నిర్వాహ‌కులు జల్లెడ ప‌ట్ట‌డం మొద‌లు పెట్టార‌ని , ఈ సారి యాంక‌ర్ రవితో పాటు హైప‌ర్ ఆదిల‌ను బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకువ‌చ్చేందుకు చాలా కృషి చేస్తున్న‌ట్టు టాక్. ఇక కొద్ది రోజుల క్రితం సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ అనే వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ బిగ్ బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్స్‌లో ఒక‌రు అని వార్త‌లు వ‌చ్చాయి.

Big | Telugu Rajyam
తాజాగా బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే మ‌రో ఇద్ద‌రి కంటెస్టెంట్స్ పేర్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారెవ‌రో కాదు ఢీ షోలో అద‌రగొట్టిన ట్రెండింగ్ బ్యూటీ వ‌ర్షిణి. టిక్ టాక్ ద్వారా ఫేమ‌స్ పొందిన దీపికా.ఈ ఈమె ఇప్పుడు ఢీ షోలో మెంట‌ర్‌గా ప‌ని చేస్తుంది. ఈ ఇద్ద‌రు బ్యూటీస్ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై స‌త్తా చాటుతుండ‌గా, వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. దీంతో వారిద్ద‌రితో సంప్ర‌దింపులు మొద‌లు పెట్టిన‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంద‌రికి ఇప్పుడు మంచి గుర్తింపు ద‌క్కిన‌ప్ప‌టికీ, షో ప్రారంభం స‌మ‌యంలో వీళ్లు ఎవ‌రు పెద్ద‌గా ఫేమ్ కాదు. అంద‌రు కొత్త ముఖాలు కావ‌డంతో షో మొద‌ట్లో రేటింగ్ భారీ స్థాయికి ప‌డిపోయింది. రాను రాను ఈ ముఖాలు అల‌వాటు ప‌డ‌డం వ‌ల‌న కొద్దిగా షో రేటింగ్ పెరుగుతూ వ‌చ్చింది. ఈ సారి అలాంటి త‌ప్పులు చేయోద్ద‌ని మేక‌ర్స్ ఫేమ్ అయిన వాళ్ళ‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డార‌ట‌.

- Advertisement -

Related Posts

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్...

ఐటీ పాలసీ, EMC, డిజిటల్ లైబ్రెరీలపై సీఎం జగన్ సమీక్ష…పలు కీలక నిర్ణయాలు !

తాడేపల్లి: ఎపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్(EMC) ,గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైన అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ...

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

Latest News