త్వరలోనే ఓ గుడ్ న్యూస్.. అలీ రెజా కామెంట్స్ వైరల్

Ali reza katest comments on his new home

బిగ్ బాస్ ఫేమ్ అలీరెజా సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. బుల్లితెర అర్జున్ రెడ్డి, హ్యూమన్ బుల్డోజర్ అంటూ యాంగ్రీ మెన్‌గా కొన్ని బిరుదులను అందుకున్నాడు అలీ రెజా. విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తుండేవాడు. అలా అలీ రెజాకు వెరైటీ వెరైటీ ట్యాగ్‌లను జోడించారు నెటిజన్లు. అయితే బయట మాత్రం అలీ రెజా ఎంతో కూల్‌గా ఉంటాడు. సోషల్ మీడియాలో తన అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చట్లు పెడుతుంటాడు.

Ali reza katest comments on his new home
Ali reza katest comments on his new home

అలీ రెజా ఎక్కువగా రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ రవిలతో ఉంటాడు. బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎక్కడైనా పార్టీ చేసుకుంటే అక్కడ మాత్రం అలీ రెజా ఉండాల్సిందే. అయితే అలీరెజా చాలా రోజుల క్రితం ఓ అప్డేట్ ఇచ్చాడు. తాను ఓ అపార్ట్మెంట్‌ను కొనబోతోన్నాని తెలిపాడు.అయితే ఇంత వరకు మళ్లీ ఆ కథ ఏంటో చెప్పలేదు.అయితే తాజాగా అలీ రెజా ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి.

ఇంటిరీయర్ పనులు చేపిస్తున్నట్టుగా అలీ రెజా కనిపిస్తున్నాడు.అయితే అది తన ఇంటి పనులా? లేక వేరే ఇతర పనులా? అన్నది తెలియడం లేదు. కానీ త్వరలోనే అదిరిపోయే వార్త చెబుతాను అని అలీ రెజా అన్నాడు. దీంతో అది తన నూతన ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశ వేడుకై ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.