ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్‌తో ఎగిరి గంతేసిన బిగ్ బాస్ బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆన‌తి కాలంలోనే భారీ అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకున్నాడు. ప‌వ‌ర్ స్టార్ గా పిలిపించుకుంటున్న ప‌వ‌న్ రాజ‌కీయాల వ‌ల‌న సినిమాలు చేయ‌న‌ని చెప్పి షాకిచ్చాడు. అన్నట్టుగానే ప‌వ‌న్ రెండేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. ఇక వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, అయ్యప్ప‌నుమ్ కోషియుమ్, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ముందుగా వ‌కీల్ సాబ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేస్తుండే స‌రికి అభిమానులే కాదు సెల‌బ్రిటీస్‌లోను ఆనందం వెల్లివిరిసింది. ఆయ‌న‌తో క‌లిసి న‌టించాల‌ని కొంద‌రు న‌టీన‌టులు భావిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ హిమ‌జ కూడా ఉంది. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొన్న హిమ‌జ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో ఈ అమ్మ‌డికి సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ సర్కారు వారి పాట చిత్రంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాల‌లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఆ మ‌ధ్య మ‌హేష్ బాబుతో క‌లిసి దిగిన ఫొటో షేర్ చేసిన హిమ‌జ తాజాగా ప‌వ‌న్‌తో దిగిన ఫొటోలు షేర్ చేసింది.

త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో “ఓ మై గాడ్‌.. నేడు నా కల నెరవేరింది. తొలి ప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ గారిని చూసినప్పుడు ఆయన్ను కనీసం డైరెక్ట్‌గా చూస్తానా అనుకున్నా. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన 27వ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇంత మంచి చాన్స్‌ ఇచ్చిన దర్శకుడు క్రిష్‌కు కృతజ‍్క్షతలు” అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది హిమ‌జ . కాగా పవన్‌-క్రిష్‌ల సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్‌ చేయనున్నామని చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. హిమ‌జ‌.. నాగశౌర్య ‘వరుడు కావలెను’, సునీల్‌ ‘కనబడుట లేదు’ సినిమాల్లో నటిస్తోంది.