కొత్త దంప‌తుల‌కు ప్ర‌భాస్ స‌ర్‌ ప్రైజింగ్ గిఫ్ట్‌ !

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత ఎంఎస్ రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ ఫిబ్ర‌వ‌రి 13 రాత్రి త‌న ప్రేయ‌సి దీపిక‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల‌న వీరి వివాహం నిరాడంబ‌రంగా జ‌ర‌గ‌గా, వేడుక‌కు బిగ్ బాస్ బ్యూటీ తేజ‌స్వి త‌ప్ప ఇత‌ర సెల‌బ్రిటీస్ ఎవ‌రు వ‌చ్చిన జాడ లేదు. అయితే ఎంఎస్ రాజుతో మంచి సాన్నిహిత్యం ఉన్న ప్ర‌భాస్ పెళ్లి వేడుకకు హాజ‌రు అవుతాడ‌ని అంద‌రు భావించిన అది జ‌ర‌గ‌లేదు.

Image

ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో సుమంత్ అశ్విన్- దీపిక‌ల పెళ్లికి ప్ర‌భాస్ హాజ‌రు కాలేక‌పోయాడు. దీంతో బొకేతో పాటు విలువైన బహుమ‌తులు పంపాడు. ఈ విష‌యాన్ని సుమంత్ తండ్రి ఎంఎస్ రాజు త‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నాడు. కొత్త దంప‌తుల‌కు పంపిన గిఫ్ట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ డార్లింగ్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

ప్ర‌భాస్‌కు ఎంఎస్ రాజు వ‌ర్షం, పౌర్ణమి అనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల‌ను అందించిన సంగ‌తి తెలిసిందే. కాగా, సుమంత్‌- దీపిక‌ల‌ది ప్రేమ వివాహం కాగా, తొలిసారి ఓ పెళ్లిలో వీరిద్ద‌రు క‌లిసారు. దీపిక అమెరికాలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌గా, ప్ర‌స్తుతం స్టైంటిస్ట్‌ గా పని చేస్తుంది.