బిగ్‌బాస్ షోలోకి కంటెస్టెంట్ల వెనుకున్న పెద్ద కథలే ఉన్నాయి. ఏ ఒక్కరి ఇళ్లు కూడా సంతోషాలు, సంబరాలతో కళకళలాడటం లేదని తెలుస్తోంది. వారి వారి కుటుంబాలు ఎన్నో కష్టాలు పడ్డాయి, ఎన్నో కోల్పోయామని తమ ధీనగాథలు చెప్పి అందర్నీ ఏడిపించేశారు. అందులో మరీ ముఖ్యంగా అరియానా కథ కాస్త వెరైటీగా ఉంది. చిన్న తనం నుంచి మగ దిక్కులేని బతుకులు తమవి అంటూ అందర్నీ ఏడిపించేసింది.
మామూలుగా అరియానా అనేది అసలు పేరు కాదు. ఓపెనింగ్ సెరమెనీ రోజు నాగార్జున అసలు పేరేంటి అని అడిగినా చెప్పలేదు. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో అసలు గుట్టు విప్పింది. తన అసలు పేరు అర్చన అని చెప్పింది. ఐదేళ్ల వయసులోనే తండ్రి మా నుంచి విడిపోయాడని, తల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్సు కాబట్టి మమ్మల్ని బాగానే పోషించిందని చెప్పుకొచ్చింది.. చాలా పద్దతిగా పెంచిందని అమ్మ గొప్పదనం చెప్పుకొచ్చింది.
అయితే తాను యాంకరింగ్ ఫీల్డ్ లోకి వస్తానంటే మొదట ఒప్పుకోలేదని చెప్పింది. డిగ్రీలో కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి.. చదువు అబ్బ లేదు కనీసం ఇదైనా చేస్తానని పట్టుబట్టి ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇందులోనూ పాలిటిక్స్ ఉన్నాయి.. నన్ను తొక్కేశారు. ఫుడ్ లేక ఎన్నో రోజులు పస్తులున్నాను, చివరకు రూ 500, రూ 800లకు కూడా ఈవెంట్లకు వెళ్లేదాన్ని అని తన ధీన స్థితి గురించి చెప్పుకొచ్చింది. అలా వెళ్లిన తాను ఈనాడు బిగ్ బాస్ హౌస్ వరకు వచ్చానని గొప్పగా చెప్పుకుంది అరియానా.