ఏదో దేశం కోసం ఆడుతున్నట్టు ఏంటయ్యా ఆ వీడియోలు.. అరియనాపై నెటిజన్స్ ఫైర్!

బుల్లితెరపై ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగు ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పదో వారంలోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.టైటిల్ కోసం కంటెస్టెంట్ లు తీవ్ర స్థాయిలో పోటీ పడుతూ టాస్క్ లలో కూడా వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వహించిన ఒక టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ లు అందరూ ఎంతో శ్రద్ధగా ఆ టాస్క్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది.

అదేంటంటే ఒక చేతితో తాడును హ్యాండిల్ చేస్తూ.. మరొక చేతితో బ్రిక్స్ పడిపోకుండా ఊయలలో ఒకదానిపై ఒకటి పెడుతూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అయితే ఈ టాస్క్ లో ఓకే కాలిపై నిలబడి చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా అరీయానా ఎంతో శ్రద్ధగా ఆడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏదో దేశం కోసం ఆడుతున్నట్టు ఏంటయ్యా ఆ వీడియోలు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే 10 వ వారం నామినేషన్స్ లో భాగంగా అరీయాన కూడా నామినేషన్స్ లో ఉన్నారు. మరి అరియానా ఈ వారం సేఫ్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో చివరి వరకు పోరాడిన అరియన ఈసారైనా టైటిల్ గెలవాలని ఎంతో కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.