Ariyana: బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని తేలీక సీరియస్ అయిన అరియాన..!

Ariyana: ఈవారం బాబా భాస్కర్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించాడు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఈ విషయం చెప్పకుండా వారితో గేమ్ ఆడించాడు. అయితే మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి తెలియని ఇంటి సభ్యులు గేమ్ లో పాటిస్పేట్ చేశారు. నిజానికి బాబా భాస్కర్ మాస్టర్ నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి సీక్రెట్ రూమ్ లో ఉంటూ ఇంటి సభ్యులను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ నామినేషన్స్ పూర్తయిన తర్వాత బాబా భాస్కర్ మాస్టర్ కి ఒక పవర్ ఇచ్చాడు.

నామినేట్ అయిన వాళ్లలో ఒకరిని సేవ్ చేయమని బాబా భాస్కర్ మాస్టర్ కి బిగ్ బాస్ .. మాస్టర్ బాగా ఆలోచించి బిందు మాధవిని సేవ్ చేశాడు. అయితే బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఇంటి సభ్యులకు ఎలా చెప్తాడు అని ప్రేక్షకులు అందరూ ఆత్రుతగా ఎదురు చూశారు. ఐతే బాబా భాస్కర్ మాస్టర్ గేట్ దూకి హౌజ్ లోకి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అయితే బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చానని చెప్పకపోవడంతో అరియాన సీరియస్ అవుతూ.. బయటికి వెళ్ళమని చెప్పింది. నేను రావటానికి ఒక కారణం ఉందని మాస్టర్ చెప్పినా కూడా వినిపించుకోకుండా అరియాన అబ్జెక్ట్ చేస్తూ మాస్టర్ కి షాక్ ఇచ్చింది.

భాస్కర్ మాస్టర్ నామినేషన్ లో ఉన్న వాళ్ళను ఒక దగ్గర కూర్చోమని చెప్పి నామినేషన్ లో లేని వాళ్ళు అందరూ మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో ఇంట్లో ఉండే అర్హత లేని వారి పేరు ఒకటి చెప్పమని అడిగాడు. దీంతో అరియాన మాట్లాడుతూ మేమెందుకు సెలెక్ట్ చేయాలి ..? మాకు బిగ్ బాస్ చెప్పలేదు కదా అని ఎదురు తిరిగింది. ఇప్పుడు మీరు హౌస్ లోకి వచ్చి ఒకరిని బయటికి పంపించాలి అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాము. మేము ఎవరిని సెలెక్ట్ చేయం అని వాదించింది.అయితే మేము పేరు చెప్పినా కూడా వాళ్ళని హౌస్ నుండి బయటకి తీసుకెళ్లనని మాటిస్తే ఒకరి పేరు చెప్తామని మాస్టర్ కి చెప్పింది. అయితే బాబా భాస్కర్ మాస్టర్ ప్రామిస్ చేయడంతో అనిల్ పేరు చెప్పారు. మాస్టర్ సభ్యులందరికీ నేను కెప్టెన్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పాడు.ఎట్టకేలకు అనిల్ సేవ్ అవ్వటంతో అందరూ ఆనంద పడ్డారు.