నవంబర్ లో పెళ్లిపీటలెక్కనున్న ఆరియనా.. వరుడు కూడా సిద్ధమే?

బిగ్ బాస్ నాన్‌స్టాప్ కార్యక్రమం చివరికి రావడంతో ఈ కార్యక్రమంపై అభిమానులను తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరు ఈ టైటిల్ అందుకుంటారు అనే విషయంపై పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి . ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది అనగా ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రముఖ ఆస్ట్రాలజర్ శాంతిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఈ క్రమంలోని ఈమె హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్ లో జాతకాలను చెబుతూ షాకింగ్ కామెంట్ చేశారు. అదేవిధంగా కంటెస్టెంట్ లతో పలు టాస్క్ లు ఆడించి ఎంటర్టైన్ చేశారు.

ఈ క్రమంలోనే శాంతి బోల్డ్ బ్యూటీ ఆరీయానా జాతకం చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా అరియానా తన పెళ్లి గురించి ఆస్ట్రాలజర్ శాంతిని అడగగా ఆమెకు లవర్స్ కార్డ్ రావడంతో.. ఈ నవంబర్ నెలలోనే అరీయనా పెళ్లి కావచ్చని, ఈ ఏడాదిలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కుతుంది అంటూ తన జాతకం చెప్పారు. తనని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కూడా సిద్ధంగా ఉన్నాడు అంటూ శాంతి తెలియజేశారు.

బిగ్ బాస్ నుంచి వెళ్లిన తర్వాత కొత్త ఇంటిని కొనుగోలు చేయడమే కాకుండా కొత్త లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారని, తన జీవితం ఫుల్ సెలబ్రేషన్స్ తో నిండిపోయి ఉందని జ్యోతిష్య నిపుణలు శాంతి అరియానా జాతకం గురించి తెలియజేశారు. ఈ విధంగా ఈమె జాతకం చెప్పడంతో ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు అరీయానా చేసుకోబోయే వాడు ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు.