బిగ్ బాస్ షోలో మోనాల్ అఖిల్ కథ అందరికీ తెలిసిందే. మొదటి నుంచి ఈ ఇద్దరి ట్రాకుపై జనాలు ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. అయితే మధ్యలో మోనాల్ అఖిల్ మధ్య దూరం, అంతకు ముందు అభిజిత్‌తో గొడవలు ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. మొత్తానికి అఖిల్ మోనాల్‌ను నామినేట్ చేయడంతో ఇంటా బయటా అందరూ షాక్ అయ్యారు. పైగా టాస్కులు వచ్చినప్పుడు మోనాల్‌ను పక్కనపెట్టేస్తున్నాడు. ఆ క్లారిటీ అయితే అఖిల్‌కు ఉంది. కానీ మోనాల్‌కు మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
నిన్నటి అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఇంట్లో బర్త్ డే వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేశాడు. అభిజిత్ కూడా విషెస్ చెప్పాడు. కట్ చేసిన కేకును మోనాల్‌కు తినిపిస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ తనది తానే తినేశాడు.. మోనాల్ కూడా అదే చెప్పింది. అఖిల్ తనది తానే తినిపించుకున్నాడు.. ఆ తరువాత మోనాల్‌కు తినిపించాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత గార్డెన్ ఏరియాలోని సోఫా దగ్గర అసలు కథ మొదలైంది.
సోఫాలో కూర్చున్న మోనాల్ అఖిల్ కాస్త రొమాంటిక్ ట్రాకు ఎక్కారు. తాను బాగా అలసిపోయాను.. ఇక పడుకుంటాను అని వెళ్లబోయాడు. లేచి నిల్చున్నాడు. హగ్ ఇవ్వు అన్నట్టుగా పోజు పెట్టాడు. ఇక మోనాల్ వచ్చి గట్టిగా హత్తుకుంది. ముద్దులతో ముంచెత్తింది. ఇలా మొదటి సారి ఇచ్చావ్ కదా అని మోనాల్‌తో సరసం ఆడాడు. ఇది బర్త్ డే గిఫ్ట్ అని మోనాల్ సెటైర్ వేసింది. ఇలా అయితే రోజూ నా బర్త్ డే ఉంటే బాగుండు అని అఖిల్ కౌంటర్ వేశాడు. దీంతో ఆశ దోశ అన్నట్టు మోనాల్ చూసింది. మొత్తానికి మోనాల్ అఖిల్ సరైన ట్రాకులోకి ఎక్కారు.