మోనాల్ చేష్టలు శ్రుతి మించిపోయాయ్.. అలా చేయడంతో అందరూ ఫైర్!

బిగ్‌బాస్ ఇంట్లో మోనాల్ కథలు వేరేలా ఉంటాయి. ఒకరంటే ఇష్టమని చెబుతుంది.. ఇంకొకరితో క్లోజ్‌గా ఉంటుంది. అలా అభిజిత్, అఖిల్‌ను ఇద్దరినీ తన వెంట తిప్పుకుంటుంది. మోనాల్ చేష్టలతో అభిజిత్ అఖిల్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం తయారైంది. దీనంతటికి కారణం మోనాల్ చేసే పనులే. పగలంతా ఒకరితో ఉంటుంది.. రాత్రంతా మరొకరితో ఉంటుంది. ఇక ఈ ఇద్దరితో తప్పా మిగతా కంటెస్టెంట్లతో అంతగా కలిసిపోయినట్టుగా కూడా కనిపించదు.

Bigg Boss 4 Telugu Monal Supports Akhil
Bigg Boss 4 Telugu Monal Supports Akhil

అయితే నిన్నటి టాస్క్‌లో అభిజిత్, మోనాల్ ఒక టీంలో ఉండగా.. అఖిల్‌ది వేరే టీం. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా అఖిల్‌ గార్గెన్ ఏరియాలోని కుర్చిలో కూర్చుని ఉంటాడు. బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరేం చేసినా అలాగే కూర్చుని ఉండాలని తెలిపాడు. ఈ మేరకు అభిజిత్, అరియానా, అవినాష్, మెహబూబ్, లాస్య, మోనాల్ ఇలా అందరూ అఖిల్‌ను కుర్చీలోంచి లేచిపోయాలే చేయాలి. బిగ్ బాస్ ఇచ్చిన కొన్ని ప్రాపర్టీస్‌తో అఖిల్‌ను డిస్టర్బ్ చేయాలి.

Bigg Boss 4 Telugu Monal Supports Akhil
Bigg Boss 4 Telugu Monal Supports Akhil

అవినాష్, మెహబూబ్, అభిజిత్ ఏదో ఒకటి చేసి అఖిల్‌ను లేపే ప్రయత్నం చేశారు. అఖిల్‌పై షాంపు, నీళ్లు, సబ్బు కలిపి నీళ్లు పోస్తూ అఖిల్‌ను లేపే ప్రయత్నం చేస్తుండగా.. అవి చూసి భరించలేని మోనాల్ టాస్క్‌కు భంగం కలిగించింది. దీంతో అందరూ ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. మెహబూబ్, అవినాష్, అభిజిత్ అందరూ కలిసి మోనాల్‌పై విరుచుకుపడ్డారు. టాస్క్ వరకైనా బాధ్యతగా ఉండాల్సిన పని లేదా? వేరే వేరే టీంలో ఉన్నా సరే ఇలా సపోర్ట్ చేయడమేంటని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.