బిగ్ బాస్ టీం కొత్తగా ఆలోచించదు.. ఆలోచించలేదు. ఎందుకంటే గత సీజన్లు లేదా వేరే భాషల్లో పాటించిన పద్దతులను ఉన్నది ఉన్నట్టుగా వాడేస్తుంటారు. ఎక్కడో ఏదో సీజన్‌లొ ఏదో ఒక వారంలో ఓ టాస్క్ ఇస్తే.. ఇక్కడ కూడా అదే వారంలో అదే టాస్క్ ఇస్తూ ఉంటారు. అలా బిగ్ బాస్ టీం అక్కడెక్కడి ఐడియాలనో ఇక్కడి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అయితే ఈ సారి కూడా అదే పద్దతిని ఫాలో అయ్యేలా కనిపిస్తున్నారు.
మూడో సీజన్‌లో అలీరెజా ఎలిమినేట్ అయి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందే రాహుల్ సీక్రెట్ రూం నుంచి బయటకు వచ్చాడు. అలాంటి ఓ కాన్సెప్ట్‌నే ఈ సారి కూడా ఫాలో అయ్యేలా కనిపిస్తున్నారు. అఖిల్ సీక్రెట్ రూం నుంచి బయటకు వచ్చాడు. అయితే కొద్ది సేపటి క్రితం నుంచి సోసల్ మీడియాలో ఓ పేరు మార్మోగిపోతోంది. కుమార్ సాయి రీ ఎంట్రీ ఫిక్స్ అంటూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
కుమార్ సాయి పదకొండో వారంలో ఇంట్లోకి రాబోతోన్నాడంటూ నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. అయితే వీటిలో ఎంత నిజముందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే గత సీజన్లలో అయితే ఇలాంటివే జరిగాయి. మరి ఈ సారి కూడా ఆ పద్దతిని ఫాలో అయి కుమార్ సాయిని రీ ఎంట్రీలో తీసుకొస్తే మాత్రం ఆట ఒక్క సారిగా యూటర్న్ తిరుగుతుందని చెప్పొచ్చు. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన కుమార్ సాయి బాగానే కష్టపడ్డాడు. కానీ ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. మరీ ఈ రీ ఎంట్రీ వార్తలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.