బిగ్‌బాస్ 4 విజేత అతడేనట.. గంగవ్వ చెప్పినట్టే జరిగితే అది ఓ చరిత్రే!!

Bigg Boss 4 Telugu Gangavva Predict That Avinash Would Be Title winner

బిగ్ ‌బాస్ 4 సీజన్‌లో ప్రస్తుతం ఆరో వారం నడుస్తోంది. మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఐదు ఎలిమినేషన్స్ జరిగాయి. ఇందులో వరుసగా సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత ఎలిమినేట్ అయ్యారు. ఇక గంగవ్వ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఐదో వారంలొ బయటకు వెళ్లింది. బయటకు వచ్చిన గంగవ్వ సంచలన కామెంట్లు చేస్తోంది. అఖిల్, కుమార్ సాయి, హారిక, అవినాష్‌ తదితరులపై గంగవ్వ చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతోంది.

Bigg Boss 4 Telugu Gangavva Predict That Avinash Would Be Title winner
Bigg Boss 4 Telugu Gangavva Predict That Avinash Would Be Title winner

తాజాగా గంగవ్వ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్ ఎవరన్నది జోష్యం చెప్పేసింది. ఈ నాల్గో సీజన్ టైటిల్ గెలిచేది అవినాష్ అని గంగవ్వ బలంగా చెప్పింది. అయితే నిజంగానే గంగవ్వ చెప్పినట్టు అవినాష్ గనుక విన్నర్ అయితే అది ఓ చరిత్రే అవుతుంది. ఎందుకంటే ఇంత వరకు ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ విజేతగా నిలిచిన దాఖలాలు లేవు. మూడు సీజన్లలో వచ్చిన ఏ వైల్డ్ కార్డ్ కూడా విజేతగా నిలవలేదు. కానీ గంగవ్వ చెప్పినట్టు జరిగే అవకాశం ఉందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అవినాష్‌కు దాదాపు అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి. కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడన్నా ఒకే ఒక్క నెగెటివ్ పాయింట్ ఉంది. ఆ క్రమంలో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా అందరితో బాగానే కలిసిపోయాడు. లోపల కంటెస్టెంట్లను నవ్విస్తూనే బయట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కానీ ఇంత వరకు ఒక్కసారి కూడా తనను తానుగా అసలు స్వరూపాన్ని బయట పెట్టలేదని, పోను పోనూ అవినాష్ ప్రవర్తన, ఆడే ఆట, పద్దతిపై ఆధారపడి ఉంటుంది. గంగవ్వ చెప్పినట్టుగా అవినాష్ విన్ అవుతాడో లేదో ఇప్పుడైతే కచ్చితంగా అంచనా వేయలేము.