అతనే బిగ్ బాస్ విన్నర్.. కుండబద్దలు కొట్టేసిన గంగవ్వ

బిగ్ బాస్ షో నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మధ్యలో బయటకు వచ్చింది గంగవ్వ. గంగవ్వ ఇంట్లో ఉన్నంత వరకు బయట ఎవరికి ఎలాంటి ఇమేజ్ ఉందో తెలియదు. తనను ఎవరు బాగా చూసుకుంటే వారే మంచి వారు.. వారే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే భ్రమలో ఉండేది. కానీ బయటకు వచ్చాక అసలు విషయం బోధపడింది. అందుకే మొదట్లో గంగవ్వ మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఎంతో తేడా ఉంటోంది.

Bigg Boss 4 Telugu Gangavva About Abhijeet

ఇంట్లో నుంచి బయటకు వచ్చే సమయంలోనూ అఖిల్ అంటేనే తనకు ఇష్టమని, ఈ లవ్ సింబల్‌ కూడా ఇచ్చాడని తెగ సంబరపడిపోయింది. అయితే బయటకు వచ్చిన గంగవ్వకు అసలు విషయం తెలిసింది. ఎవరికి ఎక్కువ ఇమేజ్, పాపులార్టీ ఉందని తెలిసింది. అందుకే ఒకప్పుడు అఖిల్ తనకు ఇష్టమని చెప్పేది కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఇష్టమేనని కలరింగ్ ఇస్తోంది.

Bigg Boss 4 Telugu Gangavva About Abhijeet

పైగా విన్నర్ ఎవరు అవుతారని అంటే ఒకప్పుడు అవినాష్, కుమార్ సాయి అనే ఏవేవో పేర్లుచెప్పింది. కానీ తాజాగా విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉందని అంటే అభిజిత్ అని టక్కున చెప్పింది. అభిజిత్ ఏం చేయడు ఖాళీగా ఉంటాడని నామినేట్ చేసిన గంగవ్వే అసలు సంగతి తెలుసుకుంది. జనాలు అభిజిత్‌కే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు.. అతనే విన్నర్ అవుతాడని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.