బిగ్‌బాస్ షోలో మోనాల వ్యవహారం వింతగా మారింది. ఒకరితో ఇష్టమని చెబుతుంది.. ఇంకొకరితో 24 గంటలు మాట్లాడుతూనే ఉంటుంది. అక్కడో మాట ఇక్కడో మాట చెబుతూ ఇద్దర్నీ తన వైపు తిప్పుకుంటుంది. అలా మోనాల్ చుట్టూ అభిజిత్, అఖిల్ తిరుగుతున్నారు. పరోక్షంగా ఆమె వల్ల ఇద్దరూ దూరమయ్యారు. అయితే మొదటి నుంచి మోనాల్ విషయంలో అందరికీ ఓ అనుమానం ఉండేది.
మొదటి వారంలోనే మోనాల్ గురించి దివి ఓ విషయం చెప్పింది. మోనాల్ ఒకే విషయాన్ని నాలుగు రకాలు నాలుగు సార్లు అబద్దాలు చెప్పిందని దివి నాగార్జున ముందు వెల్లడించింది. అందుకే ఇక ఆమెను నమ్మను అని తెగేసి చెప్పింది. అయితే మళ్లీ గత వీకెండ్‌లోనూ అలాంటి ఘటనే వచ్చింది. ఐదో వారంలో నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ అఖిల్ ఎంతగా వాగ్వాదానికి దిగారో అందరికీ తెలిసిందే. అది కూడా మోనాల్ విషయాన్ని అడ్డుపెట్టి రచ్చ రచ్చ చేశారు.
అయితే ఇలా తన పేరును మధ్యలో పెట్టడంతో మోనాల్ తెగ ఫీలైంది. ఈ విషయాన్ని అభిజిత్ వద్ద ప్రస్థావిస్తూ తప్పు అఖిల్‌దేనని చెప్పిందట. అదే నాగార్జున అడిగితే ఇద్దరి తప్పుందని చెప్పింది, ఇలా మాట మార్చడంతో మోనాల్ గుట్టు రట్టైంది. ఈ విషయంలో అభిజిత్ తెగ బాధపడ్డాడు. నా దగ్గర ఒకటి ఇంకొకరి దగ్గర ఇంకోటి నాగార్జున సర్ దగ్గర మరోకటి చెబుతావా? అంటూ ఫైర్ అయ్యాడు. ఇక మనం మట్లాడుకోకుండానే ఉందాం అదే మంచిది అంటూ మోనాల్‌తో దూరంగా ఉండిపోయాడు అభిజిత్. మరి ఈ గొడవ ఇలా ఒక్కరోజుకు పరిమితం అవుతుందా? లేదా ఇలానే కంటిన్యూ అవుతుందా? అనేది చూడాలి.