వాస్తు దోష నివారణలో ఉప్పు ప్రయోజనాలు..?

సాధారణంగా ప్రతి ఇంట్లో ఉప్పుని వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వంటలు రుచికరంగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరిగా వేయాలి. ఇలా ఎక్కువగా వంటలకు ఉపయోగించే ఉప్పు ద్వారా మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాస్తు దోష నివారణలో ఉప్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇల్లు నిర్మించుకోవడం దగ్గర నుండి ఇంట్లో ఉన్న వస్తువులు అమర్చుకునే వరకు ప్రతిదీ వాస్తు నియమాలను అనుసరిస్తూ చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే వాస్తవ నియమాలకు విరుద్ధంగా ఏవైనా పనులు చేసినప్పుడు వాస్తు దోషం వల్ల ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇలా వాస్తు దోష నివారణకు ఉప్పు ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు దోషం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎక్కువగా కుటుంబ సభ్యులు అలసట నిరాశతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వాస్తు దోషం కారణంగా మనం చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా మనం అనుకున్న పనులు ఆటంకాల వల్ల నెరవేరకపోతే.. ప్రతిరోజు ఉదయం చేతిలో కొంచెం ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ ఐదు నుంచి ఏడుసార్లు చుట్టి ఆ తర్వాత ఆ ఉప్పు నీటిలో వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అయితే పొరపాటున కూడా ఉప్పు ని నీటిలో కాకుండా బయట పడేయరాదు.

అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడినప్పుడు నైరుతి మూలలో ఒక గ్లాసు నీటిలో కొంచం ఉప్పు కలిపి ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా డబ్బుకు కొరత ఏర్పడదు. అలాగే కొన్ని సందర్భాలలో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఆడిటితో ఇటలీ శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా వాస్తు దోషాలు వల్ల సమస్యలతో సతమతమయ్యేవారు ఉప్పుతో కొన్ని నివారణ చర్యలు చేయడం వల్ల ఆ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.