పాపం సన్నీ, దారుణంగా వెన్నుపోటుకి గురయ్యాడు

కారణం చెప్పి మరీ పోటు గట్టిగా పొడిచేశారు హౌస్ మేట్స్ వీజే సన్నీని. వెనక నుంచి కాదుగానీ.. ముందు నుంచే పొడిచినా, అది వెన్నుపోటుగానే భావించాలి. ‘నేను నిన్ను కెప్టెన్‌గా సపోర్ట్ చెయ్యను..’ అని ముదే చెప్పిన కాజల్, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సన్నీకి ‘పోటు’ పొడవాల్సింది పోయి, చిత్రంగా శ్వేతకు పోటు పొడిచేసింది.

కెప్టెన్సీ టాస్క్ సమయంలో వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఈ వెరైటీ ఎపిసోడ్ విన్నర్‌గా నిలిచాడు శ్రీరామచంద్ర. నిజానికి గెలవాల్సింది శ్వేత వర్మ. నిజానికి, శ్రీరామచంద్రతో పోటీ పడతానన్న మానస్, చివరి నిమిషంలో ఫ్లిప్ చేశాడు. శ్రీరామచంద్రకి వ్యతిరేకంగా ఓటెయ్యాల్సిన మానస్, యూ టర్న్ తీసుకుని.. శ్వేతకి పోటు పొడిచాడు. అది శ్వేతకు పొడిచిన పోటు కాదు, పరోక్షంగా స్నేహితుడు సన్నీకి పొడిచిన పోటు.

మానస్, సన్నీ ఓ టీమ్‌గా టాస్క్ ఆడినా.. మానస్‌లోని అసలు కోణాన్ని సన్నీ గుర్తించలేకపోయాడు. అయితే, ఇదంతా బిగ్ బాస్ హౌస్‌లో నడిచే అంతర్గత రాజకీయమేనననుకోండి.. అది వేరే సంగతి. కానీ, బయటి రాజకీయాలకంటే దారుణంగా వున్నాయి బిగ్ హౌస్‌లో రాజకీయాలు. అత్యధిక పోట్లు సన్నీకే పడ్డాయి.

సన్నీ చాలామందికి నచ్చకపోయినా.. మరీ ఇంత దారుణమైన పోట్లు అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇతరుల్ని మాట్లాడనివ్వకుండా ‘కట్’ చేసెయ్యాలనుకోవడమే సన్నీ చేస్తోన్న అతి పెద్ద తప్పు. పైగా, సన్నీని బుడ్డోడిలా చూస్తున్నారంతా. ఇదిలా వుంటే, బిగ్ హౌస్‌లో షో మ్యాన్ అనిపించుకోవాలన్న తపన మాత్రం రవిలో పోవడం లేదు. అదే అతనికి పెద్ద మైనస్ అవుతోంది.

అందరి దృష్టిలోనూ రవి గుంటనక్క అయిపోతూనే వున్నాడు. మరోపక్క, షన్నూ మీద చాలా హైప్ క్రియేట్ అయినా, హౌస్‌లో అతను చేస్తున్నదేమీ లేదు. సిరి గ్రాఫ్ కూడా పడిపోతూ వస్తోంది. శ్రీరామచంద్ర గేమ్ ప్లాన్ బాగా వర్కవుట్ అవుతోంది. వీకెండ్ వచ్చేస్తున్న దరిమిలా, ఈ వారం కంటెస్టెంట్లకు క్లాస్ పీకడానికి నాగార్జున సిద్ధమైపోవచ్చు. క్లాస్ పీకేందుకు చాలా అవకాశాలున్నాయి కూడా.