సూటు బూటుతో సిద్ధమైన బాలయ్య… అన్ స్టాపబుల్ సీజన్ 2 లో బాలయ్య ఫస్ట్ లుక్ రివీల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నట సింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఎన్.బి.కె 107 వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే బాలకృష్ణ ఇప్పుడు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. గతంలో ప్రముఖ ఓటిటి ఛానల్ అయిన ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే టాక్ షో లో హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ ఈ షో కి వచ్చిన సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేయటమే కాకుండా పంచ్ డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇలా తన బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన ఈ టాక్ షో అధిక సంఖ్యలో రేటింగ్స్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ టాక్ షో సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీంతో తొందర్లోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కానున్నట్లు షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ షో లో బాలకృష్ణ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. సూటు, బూటు, హ్యాటు ధరించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తొందర్లోనే ఈ షో కి సంబందించిన ట్రైలర్ కూడా అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.