మరో ఇద్దరు యువ హీరోలతో సందడి చేసిన బాలయ్య.. ఇది మామూలు రచ్చ కాదుగా?

నరసింహం నందమూరి బాలకృష్ణ ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రియాల్టీ షోలలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ ఓటిటి ఛానల్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ వన్ లో నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో హోస్ట్ చేస్తూ ఈ షో లో సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇలా అన్ స్టాపబుల్ మొదటి సీజన్ మంచి హిట్ అవటంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు. ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కూడా బాలకృష్ణ మరింత ఉత్సాహంతో హోస్ట్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నాడు. ఇక ఈ రెండవ సీజన్లో ఇప్పటికే మూడు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి.

మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ తన బావ నారా చంద్రబాబు నాయుడు అలాగే అల్లుడు నారా లోకేష్ తో కలిసి సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన నిమిషాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఇక రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఇద్దరి కుర్ర హీరోలతో కలిసి బాలయ్య కూడా కుర్రాడిలా రెచ్చిపోయి అమ్మాయిల విషయం నుండి రాత్రి తాగే పెగ్గు వరకు అన్ని చర్చించాడు. ఇలా మొదటి రెండు ఎపిసోడ్లు మంచి వ్యూస్ సాధించాయి. అయితే మూడవ ఎపిసోడ్ లో మాత్రం మొదటి ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసి కొంతవరకు ప్రేక్షకుల్ని నిరాశపరిచారు.

ఇక తాజాగా నాల్గవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ఎపిసోడ్లో మరో ఇద్దరూ కుర్ర హీరోలు బాలయ్య తో కలిసి సందడి చేయనున్నారు. ఆ హీరోలు మరెవరో కాదు శర్వానంద్, అడవి శేష్. ఈ కుర్ర హీరోలు ఇద్దరితో కలిసి బాలయ్య సాగించిన సరదా సంభాషణ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది . అంతేకాకుండా ఈ ఎపిసోడ్ లో ఇద్దరు హీరోలతో కలిసి బాలకృష్ణ కూడా డాన్స్ చేస్తూరెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.