బిగ్ బాస్ 7 హోస్ట్ గా బాలయ్య.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఒక ఓటీటీ షో కూడా పూర్తి చేసుకుంది.గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసింది. ఇకపోతే ఆరవ సీజన్ పూర్తి కావడంతో ఏడవ సీజన్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి మొదటి సీజన్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇక మూడవ సీజన్ నుంచి ఓటీటీలో నాన్ స్టాప్ పేరిట ప్రసారమైనటువంటి సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.మూడవ సీజన్ 4వ సీజన్ కు వ్యాఖ్యాతగా నాగార్జున ఎంతో పేరు సంపాదించుకున్నప్పటికీ తదుపరి సీజన్లలో నాగార్జున ఫెయిల్ అయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నాగార్జున హౌస్ మెట్లను వారి తప్పు ఒప్పులు తెలుసుకొని మాట్లాడరని ఒక వైపే మాట్లాడుతూ.. మరొకరి తప్పు లేకున్నా ప్రశ్నిస్తారంటూ వాదనలు తలెత్తాయి. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎన్నో వివాదాలను ఎదుర్కోవడంతో ఈయన ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాలని భావించారట.

ఈ క్రమంలోనే నాగర్జున స్థానంలో సీజన్ సెవెన్ కోసం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎంతో సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ అయితే ఈ కార్యక్రమానికి చాలా మంచి రేటింగ్ వస్తుందని భావించినటువంటి నిర్వాహకులు నాగార్జునకు బదులుగా బాలకృష్ణను రంగంలో దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.ఇక బాలకృష్ణకు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఈ షో కి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.