భార్యని పక్కన పెట్టి బా అమ్మాయిలతో అవినాశ్.. రచ్చ!

బుల్లితెర మీద ఒక్కసారి మాత్రమే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. అలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన అవినాష్ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. అయితే మల్లెమాల వారి అగ్రిమెంట్ ప్రకారం అవినాష్ జబర్దస్త్ వదిలి బిగ్ బాస్ కి వెళ్ళాలంటే 10 లక్షలు మల్లెమాల వారికి కట్టి వెళ్ళాలి. అలా అవినాష్ బిగ్ బాస్ కి వెళ్లి మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ పాపులర్ అవ్వటమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా సంపాదించాడు

అయితే కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్న తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి అనేక టీవీ షోస్ లో కూడా పాల్గొన్నారు. ఓంకార్ నిర్వహించిన ఇస్మార్ట్ జోడి అనే టీవీ షోలో కూడా వీరిద్దరు పాల్గొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఇలా అవినాష్ బుల్లితెర మీద మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన కొన్ని కార్యక్రమాలలో అవినాష్ యాంకర్ గా కూడా ప్రేక్షకులని అలరించాడు.

ఇదిలా ఉండగా ఇటీవల అవినాష్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవినాష్ పెళ్లి అయిన తర్వాత తన భార్యతో కలిసి ఎప్పుడు వీడియోలు చేస్తూ ఉండే అవినాష్ ఈ వీడియోలో మాత్రం తన భార్యని పక్కనపెట్టి అరియానా దివితో కలిసి చిందులేసాడు. ఈ వీడియోలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ దివి, అరియాన, అవినాశ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఒక పాటకి స్టెప్పులు వేశారు. ఈ వీడియో చుసిన నెటిజన్లు అవినాశ్ ఓవరాక్షన్ అని కొందరు కామెంట్ చేయగా.. భార్యను పక్కన పెట్టీ వీరితో ఎంజాయ్ చేస్తున్నావా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.