జబర్దస్త్ లో లవ్ ట్రాక్ లు పుట్టడానికి వారే కారణమా.. అసలు విషయం చెప్పిన గెటప్ శ్రీను?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆదరణ రావడం కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్స్ క్రియేట్ చేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని సుడిగాలి సుదీర్ రష్మీ మధ్య క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ విపరీతంగా ప్రేక్షకులను సందడి చేస్తుంది.అయితే ఇదంతా కూడా కేవలం కార్యక్రమం రేటింగ్ కోసమేనని ఎన్నోసార్లు వెల్లడించారు.ఇలా సుధీర్ రష్మి జంట తర్వాత బాగా ఫేమస్ అయిన వారిలో ఇమ్మానియేల్, వర్షా జోడి ఒకటని చెప్పాలి.

వీరిద్దరూ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వేదికపై సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య కూడా ఈ విధమైనటువంటి లవ్ ట్రాక్ ఉందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం కార్యక్రమం రేటింగ్ కోసమేనని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొందరు మాత్రం వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా వర్ష తనకు ఇమ్మానుయేల్ పై ఉన్న ప్రేమను బయట పెట్టారు.ఈ ప్రోమోలో భాగంగా ఓ స్కిట్ లో పాల్గొన్న వర్ష ఇమ్ము కాదన్న రోజు తన ఊపిరి ఆగిపోతుందంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా ఈమె ఈ డైలాగ్ చెప్పడంతో వెంటనే బ్యాక్ గ్రౌండ్ ఒకే ఒక లోకం నువ్వు అనే సాంగ్ ప్లే చేశారు.ఇలా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ప్లే చేయడంతో గెటప్ శ్రీను డీజే అతని దగ్గరకు వెళ్లి మీరు ఇలాంటి పాటలు ప్లే చేయడం వల్ల వారి మధ్య ఎలాంటి ప్రేమ పుట్టకపోయినా పుట్టిస్తున్నారు. కేవలం మీ వల్లనే జబర్దస్త్ కార్యక్రమంలో లవ్ ట్రాక్లు క్రియేట్ అవుతున్నాయి అంటూ గెటప్ శీను ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.