మరొకసారి కంటెస్టెంట్ల వీక్నెస్ తో ఆడుకున్న గీతు.. ఫైర్ అవుతున్న ప్రేక్షకులు?

దేశవ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా ప్రసారమవుతూ ఇప్పటికే ఐదు టెలివిజన్ సీజన్లతో పాటు ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 కూడా ప్రారంభమై 8 వారాలు పూర్తి చేసుకుంది.ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న గీత రాయల్ ప్రతివారం హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తనకు తానే గొప్ప వ్యక్తినని, తాను ఏం చేస్తే అదే కరెక్టు అని భావిస్తుంది. ఎదుటివారిని గౌరవించడం,పద్దతిగా మాట్లాడడం ఆమె డిక్షనరీలోనే లేవు. ఇక ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో సంచాలక్ గా గీతు రాయల్ ప్రవర్తించిన తీరుపై ప్రేక్షకులతో పాటు నాగార్జున కూడా ఫైర్ అయ్యాడు.

ఎదుటివారి వీక్నెస్ తో గేమ్ ఆడటం సరైన పద్ధతి కాదని నాగార్జున హెచ్చరించినప్పటికీ గీతు తన పద్ధతి మార్చుకున్నట్లు కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కూడా గీతు ఇతరుల వీక్నెస్ తో ఆడుకోవాలని ప్రయత్నించింది. అసలు విషయం ఏమిటంటే… తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ “మిషన్ ఇంపాజిబుల్” అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశాడు. వారి డ్రెస్సుపై ఉన్న నాలుగు ఎరుపు లేదా నీలం స్ట్రిప్స్ లాగేస్తే ఆ వ్యక్తి చనిపోయినట్టే. అలా ఏ టీమ్ సభ్యులు ఎక్కువ మంది చనిపోతారో వారు ఓడిపోయినట్టు.

అయితే మొదల రెడ్ టీమ్ కు చెందిన ఫైమా స్ట్రిప్స్ లాగేశారు బ్లూ టీమ్ సభ్యులు. దీంతో ఆమె మరణించి వైట్ డ్రెస్సు వేసుకుని తిరిగింది. ఇక బాలాదిత్యకు సిగరెట్లు వీక్‌నెస్ అని తెలిసినా కూడా గీతూ, శ్రీసత్య, శ్రీహాన్ కలిస సిగరెట్లూ, లైటర్ దాచేసారు. లైటర్ కావాలంటే రెండు బ్లూ స్ట్రిప్‌లు తీసి ఇవ్వాలని డిమాండ్ చేసింది అదే సిగరెట్ కావాలంటే మరో రెండు బ్లూ స్ట్రిప్‌లు ఇవ్వాలని గీతు డిమాండ్ చేసింది. దీంతో బాలాదిత్య చాలా ఎమోషనల్ అయిపోయాడు. ‘ఎంత దిగజారిపోతున్నావో అర్థమవుతోందా’ అంటూ గీతూపై అరిచాడు. అంతే కాకుండా అందరూ వద్దని చెప్పినా కూడా నేను నిన్ను నమ్మాను అంటూ ఏడ్చాడు. ఇలా గీత తన ప్రవర్తన మార్చుకోకుండా బాలాదిత్య వీక్నెస్ వాడుకొని ఆటలో గెలవాలని చూడటంతో అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు.