అందరిముందు గెటప్ శ్రీను పరువు తీసిన అన్నపూర్ణ..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత తొమ్మిది సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రేక్షకులను అల్లరిస్తోంది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా బాగా పాపులర్ అయ్యారు. అలా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. జబర్దస్త్ లో శ్రీను వేసే వైవిద్యమైన గెటప్స్ వల్ల అతనికి గెటప్ శీను అని పేరు వచ్చింది. ఒక్కో స్కిట్లో ఒక్కో విధంగా శ్రీను వేసే గెటప్ చూడగానే ప్రేక్షకులకు నవ్వు తెప్పించేలా ఉంటాయి. ఇలా తన గెటప్స్ తో పాపులర్ అయిన శ్రీను, గత కొంతకాలంగా జబర్దస్త్ లో కనిపించడం లేదు.

అంతేకాకుండా సుధీర్, ఆది, అభి వంటి ఫేమస్ కమెడియన్లు కూడా జబర్దస్త్ కి దూరమయ్యారు. దీంతో జబర్దస్త్ యాజమాన్యం వారితో వీరికి మనస్పర్తలు రావడం వల్లే వీరు జబర్దస్త్ కి దూరమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గెటప్ శ్రీను మాత్రం బుల్లితెర మీద కూడా కనిపించడం లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన శ్రీను సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. ఇప్పటికే శ్రీను ఎన్నో సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ప్రస్తుతం శ్రీను హీరోగా కూడా నటిస్తున్నాడు. అందువల్ల సినిమాలకి జబర్దస్త్ కి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటంతో శ్రీను జబర్దస్త్ మానేసాడు అని కొందరు అంటున్నారు.

ఇదిలా ఉండగా గెటప్ శ్రీను మళ్ళీ జబర్దస్త్ లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో రాంప్రసాద్ స్కిట్ చేస్తుండగా గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశాడు. దీంతో రాంప్రసాద్ తన స్కిట్ని ప్యాకప్ చేసి మళ్లీ శ్రీను తో కలిసి కొత్త స్కిట్ రెడీ చేసుకుని వచ్చాడు. ఈ స్కిట్ లో రాంప్రసాద్ మావాడు కమల్ హాసన్ లా నటిస్తాడు అని అనగా మీవాడు కమలహాసన్ల నటిస్తే కమలహాసన్ టీవీ ముందు కూర్చుని పల్లీలు తింటాడా అని అన్నపూర్ణమ్మ సెటైర్ వేసి శ్రీను పరువు తీసింది. దీంతో శ్రీను మొహం మాడిపోయింది. అంతేకాకుండా నాలాగా చేసి చూపించు అని శ్రీను తనదైన స్టైల్ లో యాక్టింగ్ చేసి చూపిస్తాడు. అన్నపూర్ణమ్మ కూడా శ్రీనుని ఇమిటేట్ చేస్తూ అతను చేసిన లాగే యాక్ట్ చేసి చూపిస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు.