బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెర యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె నిత్యం మూగజీవాల పట్ల స్పందిస్తూ వాటి సంరక్షణ బాధ్యతల గురించి అందరిలోనూ అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఎవరైనా పెట్ డాగ్స్ పట్ల రాక్షసంగ ప్రవర్తిస్తే వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు.
గతంలో రష్మీ వీధిలో ఓ కుక్క గాయపడి ఉండటం చూసి దానిని హాస్పిటల్లో జాయిన్ చేసి సరైన చికిత్స అందించి అనంతరం ఇంటికి తీసుకువెళ్లి తన దగ్గర పెంచుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక రష్మీ ఆపెట్ డాగ్ కి చుట్కీ అని పేరు పెట్టారు. అయితే దాని అనారోగ్యం బాగా లేకపోయినా ఈమె నిత్యం చికిత్స చేయిస్తూ ఎప్పటికప్పుడు చుట్కీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఉంటారు. తాజాగా తన పెట్ డాగ్ గురించి ఈమె స్పందిస్తూ తను బాధపడుతున్న వ్యాధి గురించి బయటపెట్టారు.
చుట్కీ కోసం ఎవరు బాధపడాల్సిన పనిలేదు. తనకు దానికి బోన్ డీజనరేటివ్ డిస్ ఆర్డర్ ఉంది.. దానిని మనం ఏ విధంగానో నయం చేయలేం.అయితే ఎప్పటికప్పుడు పెయిన్ కిల్లర్ ఇస్తూ దాని బాధను మాత్రమే తగ్గించగలము. అలాగే ఎక్స్రేలు స్కానింగ్ లతో దాని స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోగలం అంటూ ఈమె తన పెట్ డాగ్ చుట్కీ గురించి దాని హెల్త్ కండిషన్ గురించి తెలియజేయడంతో ఈమె ఎంతటి జంతు ప్రేమికురాలో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది.