ఢీ షో జడ్జి పూర్ణను ఆంటీ అన్నారని.. సుధీర్, హైపర్ ఆదిని కొట్టబోయిన యాంకర్ ప్రదీప్?

ఓవైపు డ్యాన్స్.. మరోవైపు వినోదం.. రెండు కలగలిసిన షో ఏదైనా ఉంది అంటే అది ఈటీవీ ఢీ షో. అవును.. అందులో డ్యాన్స్ కు కొదవ ఉండదు.. వినోదానికీ కొదవ ఉండదు. ఎందుకంటే.. ఆ షోలో డ్యాన్స్ మాస్టర్లే కాదు.. కమెడియన్లు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ ఉన్నారు కాబట్టి.

Anchor Pradeep Serious On Aadi And Sudheer In Dhee Show
anchor pradeep serious on aadi and sudheer in dhee show

బుల్లి తెర మీద ఢీ షో ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. తాజాగా.. ఢీ ఛాంపియన్స్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈసారి ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాంకర్ ప్రదీప్, జడ్జి పూర్ణ భార్యాభర్తలుగా ఓ స్కిట్ చేస్తుంటారు. ఇంతలో తమకు రెంట్ కు ఇల్లు కావాలంటూ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, వర్షిణి, రష్మీ.. నలుగురు వాళ్లింటికి వెళ్తారు. అప్పుడే హైపర్ ఆది ఉండి.. అంకుల్, ఆంటీ అని ప్రదీప్ ను అనేసరికి.. ప్రదీప్ ఉవ్వెత్తున లేస్తాడు. నన్ను అంకుల్ అంటావా? ఆవిడను ఆంటీ అంటావా? అంటూ సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ కూడా ఆంటీ అని మళ్లీ పిలవడంతో ఎవర్రా ఆంటీ.. అంటూ వాళ్లను కొట్టబోయాడు ప్రదీప్.

Anchor Pradeep Serious On Aadi And Sudheer In Dhee Show
anchor pradeep serious on aadi and sudheer in dhee show

వాళ్లను కొట్టబోయినా కూడా వాళ్లు మాత్రం అంకుల్, ఆంటీ అని పిలుస్తుంటే ప్రదీప్ కు పట్టరానంత కోపం వచ్చింది. అయితే.. ఇదంతా స్కిట్ లో భాగం. కాసేపు ప్రేక్షకులను నవ్వించడం కోసం వాళ్లు చేసిన స్కిట్ అది.

దానికి సంబంధించిన ప్రోమోనే రిలీజ్ చేశారు. అయితే.. ఈ స్కిట్ ఒక్కటే కాదు.. ఈ ప్రోమోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ ప్రోమోను చూసేయండి మరి..

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles