చీర కట్టులో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన యాంకర్ అనసూయ.. ఫోటోలు వైరల్?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇలా చానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లో ప్రసారమవుతున్న టీవీ షోలలో సందడి చేస్తున్న అనసూయ యాంకర్ గా తన మాటలతోనే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాంకర్ గా అనసూయ బాగా పాపులర్ కావడంతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకొని వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది.

ఇలా టీవీ షోలు సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ అందాల ఆరబోతకి అడ్డుకట్టలు ఉండవు. కొన్ని సందర్భాలలో అనసూయ ధరించే దుస్తుల వల్ల విమర్శలపాలవుతూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా… అనసూయ కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విదేశాలలో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. అమెరికాలో స్నేహితులతో బంధువులతో కలిసి అనసూయ చేసిన రచ్చ అంత ఇంతా కాదు.

ఇక అనసూయ ప్రస్తుతం న్యూ జెర్సీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అనసూయ విదేశాలలో ఉన్న కూడా అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గటం లేదు. విదేశాలలో కూడా మోడరన్ దుస్తుల కంటే చీరకట్టలోనే అనసూయ ఎక్కువగా దర్శనమిస్తోంది. చీర కట్టులో కూడా అనసూయ తన అందాలు ఆరబోస్తూ అందరిని కట్టిపడేస్తోంది. ప్రస్తుతం న్యూ జెర్సీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ ఎండిన ఆకులను కూడా వదలకుండా వాటిని చేతిలో పట్టుకుని కొంటేగా చూస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ కి దూరమైన తర్వాత అనసూయ ఇలా విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తోంది.