భర్తకు దూరమై ఒంటరితనం ఫీల్ అవుతున్న అనసూయ..వైరల్ అవుతున్న వీడియో…!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా అవకాశం దక్కించుకొని తన అందంతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటుంది. బుల్లితెర మీద గ్లామర్ షో తో రెచ్చిపోయే అనసూయ సినిమాలలో మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది.

ఇలా టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో అనసూయ షేర్ చేసే పోస్ట్ లు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఇటీవల ఆంటీ అన్నందుకు అందరిమీద కేసు పెడతానంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది.

ఇక తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనసూయ బెడ్రూంలో ఒంటరిగా పడుకొని తనకు తానే గుడ్ నైట్ చెప్పుకుంటూ తన పక్కన భర్త లేకపోవడంతో ఒంటరితనంగా ఫీల్ అయ్యింది. అయితే ప్రస్తుతం అనసూయ షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్ళటంతో తన భర్తని బాగా మిస్ అయినట్లు వీడియో రూపంలో తెలియజేసింది. అయితే అనసూయ షేర్ చేసిన ఈ వీడియో పై కొంతమంది నెటిజెన్స్ పనికట్టుకొని మరి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.