తులసికి కండిషన్ పెట్టిన అనసూయ… చిరాకులో లాస్య… ఏం చేయబోతోంది!

కుటుంబ విలువలను తెలియజేస్తూ ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే అనసూయమ్మ కళ్ళు తిరిగి పడిపోవడంతో తులసి అక్కడికి వచ్చి తనకు ధైర్యం చెబుతుంది.బిడ్డగా నాకు నీపై ఉన్న హక్కు గురించి అడుగుతున్నా నేనడిగిన దానికి కాదనుకున్న సమాధానం చెప్పాలి అంటూ తులసి అడుగుతుంది. మీరేం అడుగుతారో నాకు తెలుసు అత్తయ్య నన్ను మాత్రం మీ ఇంటికి రమ్మని పిలవద్దు అంటూ తులసి సమాధానం చెబుతుంది.ఇలా లోపల వీరు మాట్లాడుకుంటూ ఉండగా బయట లాస్య ఎంతో కోపం తెచ్చుకుంటూ అయినా నా పిచ్చి గాని నన్ను బయటికి రమ్మంటే నేనెలా వచ్చాను అంటూ సోఫాపై ఉన్న చీరను విసిరి కొడుతుంది.

వీళ్ళందరూ కలిసి చివరికి నన్ను పరాయిదాన్ని చేశారు కొంపదీసి ఆ ముసలి దానికి ఏదైనా ఆస్తి కలిసి వచ్చిందా అందుకే వాళ్ళు మాత్రమే ఆస్తిపంచుకుంటున్నారా అంటూ మండిపడుతుంది. మరోవైపు ప్రతిరోజు తన ఇంటికి వచ్చి పొమ్మని తులసిని అనసూయ వేడుకుంటుంది.ప్రతిరోజు నేను ఇంటికి రావడం అంటే కుదరదు మీరందరూ కూడా మా ఇంటికి రావచ్చు అత్తయ్య అని చెప్పగా లేదమ్మా మేము ఈ ఇంట్లో యావర్జీవ కారగార శిక్ష విధిస్తున్నాము అప్పుడప్పుడు నువ్వు వస్తే నైనా శిక్ష నుంచి కాస్త ఉపశమనం పొందుతాము రోజుకొక పదినిమిషాలైనా కనిపించి వెళ్ళు అంటూ తనని బ్రతిమలాడుతుంది.

దీంతో సరే అత్తయ్య అని చెబుతుంది అలాగే మీరు కూడా ఇకపై కన్నీళ్లు పెట్టుకోకుండా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఇక నిద్రపోండి అంటూ చెబుతుంది.తనుకు నిద్ర రావడం లేదు తులసి అని చెప్పగా వెంటనే పరంధామయ్య నాకు మీ అత్తయ్య భయపడదు కానీ గోడ మీద బల్లి కనుక ఉంటే వెంటనే రగ్గు కప్పుకొని నిద్రపోతుంది అంటూ తమాషా చేస్తారు . మరోవైపు లాస్య బయట తులసిపట్ల ఎంతో కోపం తెచ్చుకుంటుంది.

అదే సమయంలో తులసి బయటకు రాగా దేవుడు ముందు కొండెక్కుతున్న దీపంలోకి కాస్త నూనె వేసి వెలిగిస్తుంది. దీంతో లాస్య వెటకారంగా మాట్లాడుతూ తులసిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో తులసి కూడా తన స్టైల్ లోనే లాస్యకు బుద్ధి వచ్చేలా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అవమానంగా భావించిన లాస్య ఈ తులసిని ఏదో ఒకటి చేయాలి అంటూ సరికొత్త ప్లాన్ వేస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా తర్వాత ఎపిసోడ్లో లాస్య ఏం చేయబోతుందనేది తెలియనుంది.