Amardeep -Tejaswini: సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం అనంతరం విడాకులు తీసుకుని విడిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న అంశం అనే చెప్పాలి. అయితే తాజాగా ఇలా విడాకుల కల్చర్ బుల్లితెర నటీనటులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర నటీనటులు విడాకులు తీసుకొని విడిపోయిన వారు ఉన్నారు. తాజాగా మరో జంట కూడా విడాకులకు సిద్ధమవుతోందా అంటే అవుననే భావిస్తున్నారు.
బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో అమర్ దీప్ చౌదరి తేజస్విని గౌడ జంట ఒకటి. వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలా రెండు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.
ఇకపోతే ఈ జంట ఇటీవల ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి అనే కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఓంకార్ వీరిద్దరిని ప్రశ్నిస్తూ మీరు కనుక మీ వైవాహిక జీవితంలో 100% సంతోషంగా లేము అనుకుంటే మీరిద్దరూ ఒక చైర్ వదిలి కూర్చోవాలి అని చెబుతాడు. దీంతో వీరిద్దరూ వెంటనే ఒక చైర్ వదిలేసి మరొక కూర్చిలో కూర్చుంటారు.
ఇంతటితో ఈ ప్రోమో వీడియో పూర్తి అవుతుంది. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏంటి అమర్ తేజు వారి వైవాహిక జీవితంలో సంతోషంగా లేరా… గతంలో వీరి విడాకులు గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి ప్రస్తుతం వీరి వ్యవహార శైలి చూస్తుంటే విడాకులు తీసుకునేలా ఉన్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరూ నిజంగానే వైవాహిక జీవితంలో సంతోషంగా లేరా లేకపోతే షో కోసమే ఇలా చేశారా అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.