“అఖండ” సెన్సేషన్..”భీమ్లా నాయక్” ని చిత్తు చేసేసాడుగా.!

గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన “అఖండ” చిత్రం కూడా ఒకటి. దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే బాలయ్య కెరీర్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం అనేక అంచనాలు నడుమ వచ్చి వాటిని రీచ్ అయ్యి భారీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. 

అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో అదరగొట్టగా బుల్లితెరపై కూడా మంచి రెస్పాన్స్ తో ఫస్ట్ టైం సాలిడ్ టీఆర్పీ అందుకుంది. అయితే హిట్ సినిమాలు అంటే ఫస్ట్ టైం టీఆర్పీ బాగానే వస్తాయి కానీ అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ హిట్ “భీమ్లా నాయక్” కి కేవలం 6 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ మాత్రమే వచ్చాయి. 

దీనితో తెలుగు బుల్లితెర వద్ద ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా అఖండ రెండోసారి టెలికాస్ట్ అవ్వగా భీమ్లా నాయక్ ని చిత్తు చేసేసింది అని చెప్పాలి. ఈ చిత్రానికి రెండోసారి ఏకంగా 7.31 రేటింగ్ వచ్చేసింది. అంటే పవన్ ఫస్ట్ టెలికాస్ట్ కన్నా అఖండ రెండోసారి టెలికాస్ట్ లో ఎక్కువ వచ్చేసింది. మరి ఈ లెక్కన ప్రేక్షకులు ఏ సినిమాకి  బ్రహ్మరథం పట్టారో అర్ధం చేసుకోవచ్చు.