ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం 10 వారాలు పూర్తి చేసుకుని పదకొండవ వారంలో కొనసాగుతోంది. ఈ సీజన్ ప్రారంభమైన మొదటి మూడు వారాలు కంటెస్టెంట్ లందరూ టైం పాస్ చేయటంతో ఈ ఆరవ సీజన్ కి రేటింగ్స్ చాలా తక్కువ వచ్చేవి. కానీ నాగార్జున అందరికీ క్లాస్ పీకటంతో అందరూ కూడా ఆటపై దృష్టి పెట్టి ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలో ప్రతివారం జరిగే నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరుగుతోంది. అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రేక్షకుల అంచనాలకు అందకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్ షాక్ ఇస్తున్నాడు.
తాజాగా జరిగిన పదవ వారం ఎలిమినేషన్ లో డబుల్ ఎలిమినేషన్ పెట్టి బాలాదిత్యతో పాటు వాసంతి ని కూడ ఎలిమినేట్ చేశాడు. ఇక ప్రస్తుతం 11 వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. హౌస్ లో ఉన్న మొత్తం పదిమంది కంటెస్టెంట్లలో 9 మంది నామినేట్ అవ్వగా.. కెప్టెన్ గా ఉన్న ఫైవ్ ఆఫ్ మాత్రం నామినేషన్స్ నుండి తప్పించుకుంది. ఇక ఈ క్రమంలో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఒక మంచి అవకాశం కల్పించాడు. నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లకు ఖాళీ చెక్కులు ఇచ్చి ఎవరైతే ఎక్కువ అమౌంట్ రాస్తారో వాళ్లు ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ నుండి బయటపడవచ్చు. ఆ అమౌంట్ ని బిగ్ బాస్ విన్నర్ కి ఇచ్చే అమౌంట్ నుండి కట్ చేయబడుతుందని వివరించాడు. అయితే వారు రాసే అమౌంట్ గురించి ఎవరితోనో చర్చించకూడదు.. ఎక్కడా లీక్ చేయకూడదు అని రూల్ పెట్టాడు.
దీంతో ఆది రెడ్డి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తూ.. ఎలాగో తానే విన్నర్ అని.. టైటిల్ గెలిచాక తనకి వచ్చే డబ్బులో నుంచి తాను కట్ చేసుకోవడమేంటని.. చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ అమౌంట్ రాస్తారో వాళ్లు ఇంట్లో ఉండటానికి అర్హత లేదని అర్ధమని బిగ్‌బాస్ కే లెక్చర్ ఇచ్చాడు. సీజన్ మొదలైనప్పటినుండి రేవంత్, శ్రీహాన్ టైటిల్ ఫేవరెట్ గా కొనసాగుతున్నప్పటికీ.. ఆదిరెడ్డి మాత్రం టైటిల్ తనదే అంటూ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. దీంతో ఆదిరెడ్డి ప్రవర్తనకి ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామన్ మ్యాన్ అని కనికరించి ఓట్లు వేస్తుంటే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.