బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం 11 వారాలను పూర్తిచేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే బిగ్ బాస్ ఈ వారం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఫ్యామిలీనీ లోపలికి పంపించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా హౌస్ లోకి ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ లో ఒక్కసారిగా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఆదిరెడ్డి తన భార్య కవిత అలాగే కుమార్తె కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇలా తన భార్య కూతురిని చూడటంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయినటువంటి ఆదిరెడ్డి తన గురించి తన ఆట తీరి గురించి అడిగి తెలుసుకున్నారు.ఇక తన కుమార్తె మొదటి పుట్టినరోజుకు ఆదిరెడ్డి తన దగ్గర లేరంటూ గతంలో బాధపడిన విషయం తెలిసిందే. అయితే తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ తన భార్య కూతురిని ఇంట్లోకి పంపించడమే కాకుండా వారికి ప్రత్యేకంగా ఒక కేక్ కూడా పంపించడంతో తన కుమార్తె బర్తడే వేడుకలను బిగ్ బాస్ హౌస్ లో నిర్వహించారు.
ఈ విధంగా కవిత హౌస్ సభ్యులతో మాట్లాడుతూ అందరూ చాలా బాగా ఆడుతున్నారు ఆడటం కోసం మాత్రమే ఒకరినొకరు కొట్టుకోండి అంటూ ఈమె సలహా ఇస్తే నన్ను కూడా కొట్టమంటావా అంటూ ఆదిరెడ్డి అడిగారు. నువ్వేమైనా తోపా అంటూ తన భర్తకు కౌంటర్ ఇచ్చింది కవిత.ఇక ఆదిరెడ్డి తన భార్య కుమార్తెతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగా మిగతా సభ్యులందరూ సంతోషంగా ఈ వేడుకలో పాల్గొంటే రేవంత్ మాత్రం తన భార్య తనకు పుట్టబోయే బిడ్డను గుర్తుచేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.