సుత్తి దెబ్బతో గీతు ప్రవర్తన బయటపెట్టిన ఆదిరెడ్డి… నిజమేనంటు తేల్చి చెప్పేసిన ప్రేక్షకులు…?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తిచేసుకుని మూడవ వారంలో కొనసాగుతున్న ఈ సీజన్ 6 లో ప్రేక్షకులు తమ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగే మూడవ వారం కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో ఇంటి సభ్యులు ఒకరితో ఒకరికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ వారం మొత్తం చాలా రసవత్తరంగా సాగింది. ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ నుండి కెప్టెన్సీ పదవీ కోసం ఆడిన టాస్కుల వరకు ప్రతి రోజు కంటెస్టెంట్లు అందరూ ఒకరితో ఒకరికి గట్టి పోటీ ఇచ్చారు.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ప్రవర్తన పై చివాట్లు పెట్టిన నాగార్జున ఇక ఈరోజు సండే మండే అంటూ కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్లు అందరికీ చేత సుత్తి దెబ్బ అనే ఒక ఆట ఆడించాడు. ఈ ఆటలో భాగంగా ఒక్కొక్కరి గురించి అడుగుతూ.. వారి తలపై సుత్తితో ఓ దెబ్బ కొట్టాలని సూచించారు. ఇక మొదటగా ఫైమా తో నాగార్జున ఆట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఫేక్ ఎవరు అని ఫైమాని అడగ్గా.. ఆరోహి ఫేక్ అంటూ తలపై కొట్టేసింది.

ఇక ఆ తర్వాత నోటి దూల ఎవరికి ఎక్కువ అని ఆది రెడ్డీని అడగ్గా.. గీతూకి నోటి దూల ఎక్కువ అని ఆమె తలపై సుత్తితో కొట్టాడు. దీంతో నాగార్జున ఆడియన్స్ ని వారి ఓపెనియన్ అడగ్గా ..అక్కడున్న ఆడియన్స్ అందరూ యస్ అని చెప్పగా.. కేవలం ఒకబ్బాయి మాత్రమే నో అని బోర్డ్ చూపించాడు. దీంతో ఎందుకు నో అని నాగార్జున ఆ అబ్బాయిని అడగ్గా.. గీతూ ఏం మాట్లాడిన రైట్ అని చెప్పేశాడు. దీంతో గీతూ విజిల్ వేసి మరీ ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేసింది. ఆ తర్వాత దెబ్బెయ్ కూడా రైటా అని నాగార్జున అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. మొత్తానికి అన్ని విషయాలలో తల దూర్చి నోరు పారేసుకుంటుందని గీతు ప్రవర్తన మీద ప్రేక్షకులకు అభిప్రాయం ఉందని తేలిపోయింది. ఇకనైనా గీతు తన ప్రవర్తన మార్చుకుంటుందో? లేదో? చూడాలి మరి.