Aadi Reddy: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేమ్, కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్బాస్ షోకి,మూవీస్ కి రివ్యూస్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆదిరెడ్డి అదే ఫేమ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యాడు.
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యాడు. యూట్యూబ్ లో తన భార్య చెల్లితో పాటు తరచూ వీడియోలు చేస్తూ ఉంటాడు ఆదిరెడ్డి. అలాగే కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి ఫైనల్ వరకు వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని బాగా వైరల్ అయ్యాడు. అలాగే యూట్యూబ్ ద్వారా వస్తున్న డబ్బులతో బిజినెస్ లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా బాగానే సంపాదిస్తున్నాడు ఆదిరెడ్డి.
https://www.instagram.com/reel/DM98ZvpBTt5/?utm_source=ig_web_copy_link
ఇది ఇలా ఉంటే తాజాగా ఆదిరెడ్డి రెండోసారి తండ్రి అయినట్టు తెలిపాడు. ఇటీవల ఆదిరెడ్డి తన భార్య కవితకు సీమంతం నిర్వహించాడు. ఆ వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తాజాగా ఆదిరెడ్డి భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. డాక్టర్ చేతుల మీదుగా పాపాయిని ఆదిరెడ్డి తీసుకుంటున్న వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కాగా ఆదిరెడ్డికి గతంలో ఒక పాప ఉంది. ఇప్పుడు మరోసారి పాప పుట్టడంతో మరోసారి మహాలక్ష్మి పుట్టిందంటూ పోస్ట్ చేసాడు. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆదిరెడ్డికి కంగ్రాట్స్ చెప్తున్నారు.
