బిగ్ బాస్ సిరిని అవమానపరచిన ఆది.. నెటిజన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

హైపర్ ఆది .. ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. జబర్దస్త్ కామెడీ షోగా గుర్తింపు పొందిన ఆది ఇండస్ట్రీలో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. అది ఎవరిని వదలకుండా అందరి మీద పంచులు వేస్తూ కామెడీ చేస్తుంటాడు. తన టీమ్ మెంబర్స్ మాత్రమే కాకుండా యాంకర్లు, జడ్జెస్ అని ఎవరిని వదిలిపెట్టడు. ఇక మల్లెమాలవారు దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ధమాకా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు . ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.

ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హనుమంత్ కూడా హాజరైంది. ఇక సిరి మీద ఆది తనదైన శైలిలో పంచులు వేస్తూ అవమానకరంగా మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో ఆది చేసిన స్కిట్ లో సిరి కూడా చేసింది. ఈ సందర్భంగా రెండు రోజులుగా ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది అని సిరి అనగానే.. వంద రోజులు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మాకెంత బోర్ కొట్టాలి అని ఆది సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత బాగానే ఫన్ ఇచ్చాను కదా అని సిరి అనగానే ఫన్ మొత్తం షన్ను కే ఇచ్చావు.. మాకు ఎక్కడిది ? అంటూ ఆమెను అవమానపరిచేలా పంచ్ వేశాడు.

ఆది ఆ మాట అనగానే సిరి అవమానంగా ఫీల్ అయి మొహం పక్కకు తిప్పుకుంది. సిరి గురించి ఇలా పంచ్ వేయడంతో ఆది మీద నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు పాపులర్ అవ్వటానికి పక్కవారి గురించి ఇలా అవమానకరంగా మాట్లాడటానికి బుద్ధి లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలాకాలంగా ఆది గురించి ఇలాంటి విమర్శలు వస్తున్నప్పటికీ అది మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతున్నాడు.