ప్రేమించానంటు పొట్టి నరేశ్ వెంట పడుతున్న అందమైన అమ్మాయి..నరేశ్ రియాక్షన్ ఏంటో తెలుసా?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో పొట్టి నరేశ్ కూడా ఒకరు. చూడటానికి చిన్న పిల్లాడిలా ఉన్నా కూడా నరేష్ వయసులో మాత్రం చాలా పెద్దవాడు. అయినప్పటికీ నరేష్ మరుగుజ్జుతనం వల్ల చిన్న పిల్లాడిలా కనిపిస్తూ చిన్న పిల్లల గెటప్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు.

ఇదిలా ఉండగా గతంలో తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చెప్పి ఎమోషనల్ అయినా నరేష్ కి మరొక అమ్మాయి పడిపోయింది. తానే స్వయంగా వచ్చి నరేష్ ని ప్రేమిస్తున్నానని అందరి ముందు బయటపడింది. ఇదంతా నిజ జీవితంలో అనుకుంటే పొరపడినట్లే. అవునండి.. దసరా పండుగ సందర్భంగా ఈటీవీలో ప్రసారమవుతున్న దసరా వైభవం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి పొట్టి నరేష్ ని ప్రేమిస్తున్నానని అందరి ముందు బయట పెట్టింది.

ఓ ఈవెంట్ కోసం మా ఊరు వచ్చిన నరేష్ నేను నచ్చానని నా బుగ్గ కూడా గిల్లాడు అంటూ ఆ అమ్మాయి చెప్పడంతో నాకేం తెలియదని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే.. నిన్ను పెళ్లి చేసుకుంటే మా కుటుంబంలో కొంతమందికి సమాధానం చెప్పాలి అని నరేష్ అనగానే.. నన్ను పెళ్లి చేసుకుంటే నేను కోటి మందికైనా సమాధానం చెప్తాను అంటూ అమ్మాయి కౌంటర్ వేసింది. ఇక నరేష్ కి ముద్దు పెట్టడానికి ఆ అమ్మాయి దగ్గరికి వస్తే నరేష్ చెయ్యి అడ్డం పెట్టి ఇవన్నీ పెళ్లి తర్వాతే అంటూ చెప్పుకొచ్చాడు.