జాంబీ జోనర్ అంటేనే మనకు కొత్త. చనిపోయిన మనిషి తిరిగి వైరస్ రూపంలో జీవించి ఉండడం ఇతర మనుషుల్ని తినేయడం అనే కాన్సెప్టే వెరైటీ. సైన్స్ ఫిక్షన్ స్టోరీల్లోనే ఇది పరాకాష్ట. ల్యాబులో ప్రయోగం వికటిస్తే ఆ తర్వాత వైరస్ జాంబీ ఎలాంటి విలయం సృష్టించింది అన్నది ఈ సినిమాల కాన్సెప్ట్. ఈ కేటగిరీలో ఇంతకుముందు రెసిడెంట్ ఈవిల్ సిరీస్ లో ఆరేడు సినిమాలొచ్చాయి. ఆ తర్వాత 2018లో వరల్డ్ వార్ జడ్ ఈ కేటగిరీనే.
జయం రవి నటించిన జాంబీ (2019) సౌత్ లో ఓ ప్రయోగం. కానీ పెద్ద సక్సెసవ్వలేదు. అందుకే ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి జాంబీ మూవీ అంటూ ప్రయోగం మొదలెట్టిన ప్రశాంత్ వర్మ డేర్ ని మెచ్చుకోకుండా ఉండలేం. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న జాంబీ రెడ్డి టైటిల్ ని లాంచ్ చేశారు. “# కొరోనా కంటే ప్రమాదకరమైనది.. మన నుండి నరకాన్ని బయటకు తీయడానికి వస్తోంది!“ అంటూ ఆసక్తిని పెంచారు. అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి! # జోంబీరెడ్డి తెలుగులో మొదటి జోంబీ చిత్రం! అని చెబుతున్నారు.
అ.. కల్కి తర్వాత ప్రశాంత్వర్మ తదుపరి చిత్రం జోంబీ రెడ్డి మరో ప్రయోగం అనే చెప్పాలి. యాపిల్ ట్రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైనదా జాంబీ? నిజంగా ఆ రేంజులో చూపిస్తారా? అన్నది చూడాలి.