కుర్ర హీరో రేంజ్ ఇదీ
ఖరీదైన కార్లంటే మోజు.. అదో స్టేటస్ సింబల్ అని నవతరం హీరోలు భావిస్తుంటారు. తమ రేంజ్ ఇదీ అని చూపించుకోవాలనుకునే పోటీ తత్వం ఉంటుంది ఇక్కడ. ఎన్నటికైనా రేంజ్ రోవర్ రేంజుకు ఎదగాలని కలగంటారు కొత్త కుర్రాళ్లు. ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ తో అల్ట్రా రిచ్ కార్‌ని సొంతం చేసుకోవాలనే డ్రీమ్ వుంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యమా? అంటే.. ఆ కల నెరవేరాలంటే కోట్లల్లో సంపాదన వుండాలి. కోట్లలో పారితోషికాలు అందుకునే స్థాయి అయినా వుండాలి. అయితే వీటన్నిటికీ అతీతంగా రాత్రికి రాత్రే స్టార్స్ అయిన వాళ్లు కూడా ఈ మధ్య రేంజ్ రోవర్ ని మెయింటైన్ చేస్తున్నారు. చిరంజీవి నుంచి అల్లు అర్జున్ .. జూనియర్ ఎన్టీఆర్ వరకూ ఇప్పటి వరకు రేంజ్ రోవర్‌లు మెయింటైన్ చేసిన అగ్ర కథానాయకులు ఉన్నారు. కానీ నవతరంలోనూ ఆ స్థాయి చూపించేస్తున్నారు లగ్జరీ లైఫ్ పరంగా.
తాజాగా ఈ జాబితాలోకి యంగ్ హీరో కం రెబెల్ యాటిట్యూడ్ హీరో విశ్వక్ సేన్ చేరిపోయాడు. కేవలం ఒక్క సినిమాతోనే రేంజ్ రోవర్ రేంజ్‌కి చేరిపోయాడు. విశ్వక్ సేన్ నటించి డైరెక్ట్ చేసిన చిత్రం `ఫలక్‌నుమాదాస్` సంగతులన్నీ తెలిసిందే. రిలీజ్ సమయంలో, రిలీజ్ తరువాత విశ్వక్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా దాసూ రేంజ్ రోవర్‌ని సొంతం చేసుకున్నాడు. తన కొత్త రేంజ్ రేవర్ ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన విశ్వక్ సేన్ `విమర్శించకుండా ప్రశంసలు కురిపించలేరు` అని ఓ పోస్ట్ వున్న ఫొటోని పోస్ట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. నువ్వే కొన్నావ్ లే బ్రో కారూ.. అని కొంత మంది.. మాకూ టైమొస్తుందిలే అని మరి కొంత మంది ఇన్‌స్టాలో ఉడుక్కుంటున్నారు.