విశ్వక్ సేన్ ‘పాగల్’ టీజర్‌ విడుదల !

ఫ‌ల‌క్‌నుమా దాస్, హిట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన విశ్వక్ సేన్ తాజాగా పాగ‌ల్ చిత్రంతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ టీజర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ చాలా రొమాంటిక్‌గాను, ఆవేశంగాను క‌నిపిస్తున్నాడు. టీజ‌ర్ మాత్రం ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్ అందిస్తుంద‌నే చెప్పాలి.

Vishwak Sen Paagal Teaser Out Now - Sakshi

టీజర్ ను చూస్తే .. ఇందులో హీరోకు నిజంగానే పిచ్చి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ప్రేమ పిచ్చి. నచ్చిన అమ్మాయి సంతోషంగా ఉండేందుకు తనను తాను కష్టపెట్టుకునేంత పిచ్చి. రౌడీలు తల మీద సీసాలు పగలగొడుతుంటే ఎదిరించి వారిని తరిమికొట్టాల్సింది పోయి లవర్‌ ఫేస్‌లో హ్యాపీనెస్‌ కనిపించట్లేదు, ఇంకా వైల్డ్‌గా కొట్టండని రెచ్చగొడుతున్నాడు. ఫలితంగా వాళ్లు చితకబాదగా అతడి శరీరం రక్తంతో తడిసిపోయింది. అప్పుడు మనోడు హీరోయిజం చూపిస్తూ వారిని చితక్కొట్టాడు. ఈ సినిమాలో హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న విశ్వక్‌ సేన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, యాక్టింగ్‌తో అదరహో అనిపించాడు. తన ప్రతి సినిమాకు నటనా నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.

ఈ టీజర్‌ చూసిన నెటిజన్లు బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేమ పిచ్చి అంత ఈజీగా తగ్గేది కాదని, ప్రేమలో పడితే హీరో కూడా పిచ్చోడే అవుతాడని కుర్రకారు హీరోలో తమను తాము చూసుకుంటున్నారు. మ్యాజికల్ లవ్ స్టోరీగా పాగ‌ల్‌ మూవీ రూపొందుతుండగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు.

Paagal Teaser - Vishwak Sen | Naressh Kuppili | April 30th Release