పాగ‌ల్‌గా విశ్వ‌క్ సేన్ .. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ఫ‌లక్‌నామా దాస్, హిట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన హీరో విశ్వ‌క్ సేన్. ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే సినిమాని చేస్తుండ‌గా, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.

పాగ‌ల్‌గా విశ్వ‌క్ సేన్ .. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఇక అప్పుడెప్పుడో అందాల రాక్షసి నుంచి మొన్నవచ్చిన అర్జున్ రెడ్డి వరకు విలక్షణమైన సంగీతం అందించే రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తున్నారు. తాజాగా పాగ‌ల్ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో విశ్వ‌క్ సేన్ సరికొత్త లుక్‌లో క‌నిపిస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని అందిస్తున్నాడు.

ఏప్రిల్ 30న చిత్రాన్ని థియేట‌ర్‌లోకి తీసుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. “హిట్” కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా అద్భుతమైన విజువల్స్ అందించిన మణికందన్ మరొకసారి ఈ సినిమాకు పని చేస్తూ ఉండగా, “గూఢచారి” వంటి సెన్సేషనల్ హిట్ సినిమాలతో పాటు ప్రస్తుతం వస్తున్న అనేక హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేస్తున్నగ్యారీ సర్ పాగ‌ల్‌కు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.