ఎక్కడో తూర్పు గోదావరి జిల్లాలో మారు మూల పల్లె . అందులో జన్మించింది బేబీ . ఆమెకు అక్షర ముక్క రాదు . తెలుగులో మాట్లాడటం తప్ప , రాయడం చదవటం తెలియదు . ఇక సంగీత అబ్యాసం అటు ఉంచి స్వర జ్ఞానం లేదు . అయితేనేమి ఏ పాటయినా ఒకటి రెండు సార్లు విన్నదంటే చాలు అద్భుతంగా పాడగలదు . స్వరం ఆమెకు దేవుడిచ్చిన వరం .
ఆమె పాడుతుంటే , ఆమెకు తెలియకుండానే స్నేహితురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది . వూరు పేరు లేదు , అయితేనేం ఆ వీడియో వైరల్ అయ్యింది , లైకులు , షేర్లు , కామెంట్స్ , వందలు వేలు , లక్షలు … అక్షరాలా 14 లక్షల మంది బేబీ పాట విన్నారు .
” ఓ చెలియా నా ప్రియా సఖియా ” శంకర్ దర్శకత్వం వహించిన ప్రేమికుడు సినిమాలోది ఈ పాట . దీనిని స్వర పరిచింది ఏఆర్ రెహ్మాన్ . సిసిల మీడియాలో వచ్చిన బేబీ పాట చుసిన రెహ్మాన్ త్రిల్ అయిపోయాడు . ” తెలియని ఆ అద్భుతమైన , అందమైన స్వరం ” అని తన ట్విట్టర్లో పెట్టాడు . ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది . అంతక ముందు కీరవాణి, కోటి కూడా బేబీ వాయిస్ బాగుందని మెచ్చుకోవడం తో పాటు అవకాశాలు ఇస్తామని కూడా ప్రకటించారు .అదృష్టం అంటే ఇదే మరి ..!