మరణం అనే జగన్నాటకంలో ఎన్ని కుట్రలు?
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక మిస్టరీని ఛేధించేది ఎపుడు? ఇది హత్యనా? ఆత్మహత్యనా? మరణం అనే జగన్నాటకంలో అసలు నిజాలు నిగ్గు తేలేదెపుడు? దీని వెనక కుట్ర కారకుడు ఎవరు? ఎప్పటికి తేలుస్తారు? ముంబై పోలీసులు ఆత్మహత్య అని లైట్ తీస్కుంటున్నారు. బిహరీ పోలీసులు ముంబై పోలీసులు చెప్పేవి నిజాలు కావని వాదిస్తున్నారు. ఇక బాలీవుడ్ మీడియాలు సైతం రెండుగా విడిపోయి అటూ ఇటూ మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇక ఈ రచ్చలోకి రాజకీయ నాయకులు చేరి ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తుంటే ఏది నిజం! ఏది అబద్ధమో! అర్థం గాక జనం అయోమయానికి గురవుతున్నారు.
సుబ్రమణ్యస్వామి.. నారాయణ్ ఖేడ్ వంటి భాజపా నాయకులు సుశాంత్ సింగ్ మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారో ఏమో కానీ.. అతడిపై బాలీవుడ్ మాఫియా కుట్ర చేసి చంపించిందని.. కొందరు పెద్దల్ని కాపాడేందుకు ఫడ్నవిస్- థాక్రే ప్రభుత్వం ముంబై పోలీసుల సాయంతో కొమ్ము కాస్తోందని విమర్శిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది నిజమనే నమ్మాలా? లేక అసలేం జరుగుతోంది? అన్నది అర్థం కాని వ్యవహారంగా మారింది.
సుశాంత్ మేనేజర్ దిశా సాలిన్ ని అత్చాచారం చేసి చంపేశారని సుశాంత్ ని హత్య చేశారని ఒక నాయకుడు ఎదురు దాడికి దిగారు. ఇక దిశా సాలిన్ బలవన్మరణం ఆ వెంటనే సుశాంత్ ఆత్మహత్య ఇవి రెండూ మిస్టరీగానే ఉన్నాయి. ఈ రెండిటిలో బాలీవుడ్ పెద్దల హస్తం కానీ లేదా మాఫియా హస్తం కానీ ఉందనేది మెజారిటీ వర్గాల వాదన.
తాజాగా సుశాంత్ సింగ్ స్నేహితుడు.. రూమ్మేట్ సిద్ధార్థ్ పితాని మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించిన కొన్ని విషయాలు చూస్తుంటే కచ్చితంగా బాలీవుడ్ సినీమాఫియా సుశాంత్ పై కుట్ర చేసిందనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు తనకు అవకాశాలు రావని ఖర్చులకు అయినా కష్టమేనని సుశాంత్ తనతో అన్నారట. తన క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ బిల్లులపై చింతించవద్దని రియా చక్కదిద్దుతుందనే అభిప్రాయం తనవద్ద వ్యక్తం చేశాడని సిద్ధార్థ్ పితాని అంటున్నాడు.
దీనిని బట్టి చూస్తే ఆర్థిక పరమైన వ్యవహారాలు సహా ఎన్నిటిలోనో సుశాంత్ వేదనకు గురయ్యాడని అర్థమవుతోంది. భన్సాలీలు.. చోప్రాలు.. భట్స్ వేసిన రింగులోకే ప్రియురాలు రియా చక్రవర్తి ఎంటరై అతడిని వేదనకు గురి చేసిందా? అన్న సందేహం కూడా అభిమానుల్లో అలానే ఉంది. డిప్రెషన్ చికిత్స చేసిన సైక్రియాటిస్ట్ సైతం ఒక సస్పెన్స్ ఘోస్ట్ లానే కనిపిస్తున్నారు. ఈ బలవన్మరణంలో దేనికీ సరైన సమాధానం లేదు. ఏది నిజం? అన్నది తేలడం లేదు. అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొంది. మరి ఈ ప్రశ్నలన్నిటికీ బిహారీ పోలీసులు చిక్కుముడులు విప్పుతారా? ఈ కేసులో పురోగతికి ముంబై పోలీసులు సహకరిస్తారా? లేక నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి సీబీఐకి అప్పజెబుతారా? అన్నది చూడాలి.