ప్రస్థుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది దీంతో అన్ని డిజిటల్ మయం అయ్యాయి. శ్చ్చోల్ పిల్లలు చదువుకునే పాఠాలు నుండి ఉద్యోగం చేయటానికి కూడా ట్యాబ్,లాప్టాప్ ఉపయోగిస్తున్నారు. అయితే ఆఫీసులో పని చేస్తున్న సమయంలో ప్రతిసారి ఫోన్ ఉపయోగించడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల వినియోగదారుల అవసరాల మేరకు ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ ఫోన్ వాడే సదుపాయం కూడా ఉంది.
అయితే కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ ఫోన్ వాడాలనుకుంటే ఎస్సీఆర్సీపీవై ( SCRCPY ) అనే సాప్ట్ వేర్ ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుని, యూఎస్బీ ద్వారా కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ ఫోన్ వాడుకోవచ్చు.కంప్యూటర్ లో ఎస్సీఆర్సీపీవై డౌన్లోడ్ అని టైప్ చేస్తే గిట్ హబ్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది. అందులో మీ ఓఎస్ వెర్షన్ బట్టి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మొబైల్లో ఎయిర్ డ్రాయిడ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని, సెక్షన్ లో సెక్యూరిటీ అండ్ రిమోట్ ఫీచర్లోకి వెళ్లాలి. అక్కడ స్క్రీన్ మిర్రర్ అనే ఫీచర్ కనపడుతుంది. దానిని ఎనేబుల్ చేసుకోవాలి.
అలాగే మొబైల్ ఫోన్ లో యూఎస్బి డిబగింగ్ మోడ్ ఎనేబుల్ చేయాలి. ఆ తరువాత యూఎస్బి కేబుల్ తో పీసీ ని, మీ మొబైల్ ఫోన్ ను కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత కంప్యూటర్ లో ఎస్సీఆర్సీపీవై యాప్ ను రన్ చేస్తే, కంప్యూటర్ స్క్రీన్ పై మొబైల్ స్క్రీన్ కనపడుతుంది. ఇలా చేయటం వల్ల మీ మొబైల్ ఫోన్ ను కంప్యూటర్ మౌస్ నుండి ఆపరేట్ చేయొచ్చు. ఎయిర్ డ్రాయిడ్ వెబ్ ద్వారా వైర్ లెస్ గా కంప్యూటర్ కు, మొబైల్ ఫోను ను కనెక్ట్ చేయవచ్చు.అంతేకాకుండా ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్, బ్యాకప్స్, రిమోట్ టెక్సిటింగ్, కాంటాక్ట్ కాపీ లాంటి ఎన్నో ఫీచర్లను సులభంగా వినియోగించుకోవచ్చు.