వేదాళం రీమేక్ కోసం మెగా సాహసాలు
తమిళ బ్లాక్ బస్టర్ `వేదాళం` రీమేక్ కోసం మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొదలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్ టైన్‌మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. అనిల్ సుంకర చాలా కాలం క్రితం వేదాళం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి అంగీకారంతో ఈ చిత్రంలో నిర్మాతగా చేరారు. ఆచార్య చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిరంజీవి వచ్చే ఏడాది నుంచి ఈ రీమేక్ షూటింగును ప్రారంభిస్తారు. మెహర్ రమేష్ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నాడు. త్వరలోనే చిరుకి పూర్తి స్క్రిప్టును వినిపిస్తాడట.
ఇక వేదాళం చిత్రంలో తళా అజిత్ దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే. నెరిసిన జుత్తు.. పండు గడ్డం మీసకట్టుతో అతడు పూర్తిగా ఆహార్యమే మార్చేశాడు. మరి చిరంజీవి అలాంటి గెటప్ ట్రై చేస్తారా? ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? అన్నది ఇప్పటికి సస్పెన్స్.