సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతించగానే టాలీవుడ్ స్పందన తెలిసిందే. ఆపై సిఎం కెసిఆర్ పైనా చిరంజీవి ప్రయత్నం పైనా ప్రశంసలు కురిసాయి. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున కృతజ్ఞతాభావం వెల్లువెత్తింది. టాలీవుడ్ ప్రముఖులు సిఎం కెసిఆర్ పై ప్రశంసలు కురిపించారు.. కానీ నేడు ఏపీలో షూటింగులకు అనుమతించిన సీఎం జగన్ విషయంలో అలా ఎందుకు జరగలేదు?
ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. కెసిఆర్ లా కాకుండా, జగన్ ను ప్రశంసించేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఎందుకని భయపడుతున్నారో అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణకు చెందిన కొందరు ప్రముఖులు దీనిని వ్యతిరేకిస్తారనే భయంతో కొంతమంది నిర్మాతలు ఎపి సిఎం జగన్‌ను ప్రశంసిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ఇష్టపడలేదని ఓ ప్రముఖ నిర్మాత వెల్లడించారు.
టాలీవుడ్‌కు చెందిన చాలా మంది ప్రముఖులు ఆంధ్రకు చెందినవారు. జగన్‌కు కృతజ్ఞతలు చెప్పడం సముచితమే అయినా.. తమ థియేటర్లు, ప్రాపర్టీలు హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ సిఎం కెసిఆర్ కోపగించుకుంటే కష్టమేననే భావనలో ఉన్నారట. AP లో షూటింగులకు ఇలా అడగ్గానే అలా జగన్ రెండు గంటల్లో అనుమతులు ఇచ్చేశారు. దీని వల్ల 80శాతం షూటింగులు జరిగే విశాఖలో ఇకపై షూటింగుల జోరు పెరగనుంది. దీని వల్ల టాలీవుడ్ కి ఎంతో మేలు. కానీ అందుకు సానుకూలంగా స్పందించిన సీఎంని ప్రశంసించేందుకు టాలీవుడ్ జనం మాత్రం ఎందుకనో వెనకాడుతూనే ఉన్నారు మరి.