దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం షెడ్యూల్ వాయిదా పడింది. అయితే ఈలోగానే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ చెర్రీ బర్త్ డేకి ఈ సినిమాలో కీలక పాత్ర అయిన అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఈ లుక్ లో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండనుందో అర్థమైంది. `రామ రౌద్ర రుషితం` అనే టైటిల్ కి తగ్గట్టే రుద్రుడైన అల్లూరిని అతడిలో చూడబోతున్నామని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.
అయితే తారక్ బర్త్ డేకి అతడి ఫస్ట్ లుక్ రిలీజవుతుందా? అంటూ అభిమానుల్లో ఇప్పటికే డిబేట్ స్టార్టయ్యింది. ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసేలా టీజర్ ని రెడీ చేయిస్తున్నారని ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని వీక్షించాలన్న తపన కనిపిస్తోంది. అయితే ఈ టీజర్ వస్తుందా? అంటూ ఇటీవల రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ కి కుదిరినంతగా తారక్ కి కుదిరేట్టు లేదు. తారక్ విజువల్స్ విషయంలో జక్కన్నలో ఇంకా పూర్తి క్లారిటీ లేదని ప్రచారమవుతోంది.
టీజర్ రెడీ అవుతోంది.. కానీ జక్కన్న సంతృప్తి చెందడం లేదట. చరణ్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచినట్టే తారక్ అభిమానుల్ని సంతృప్తి పరచాలంటే ఇంకా ఇంకా కట్ చేస్తున్న టీజర్ లో ఏదైనా చేయాలన్న తపన పడుతున్నారట. లేదంటే ఫ్యాన్స్ నుంచి మాట పడాల్సి ఉంటుంది. అయితే విజువల్ గా కంటెంట్ ఇంకా అంత అందుబాటులో లేదని .. తారక్ పై ఇంకా చిత్రీకరించాల్సినవి ఉన్నాయని చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల ఏదీ సాధ్యపడడం లేదు. ప్రస్తుతానికి టీజర్ బెటర్ మెంట్ పై ఎడిటర్ తో పదే పదే గొడవపడుతున్నారట జక్కన్న.