పూరి జగన్నాథ్ అంటే ఛార్మికి ఎందుకు అంత ఎమోషన్..? పూరితో నిర్మాణ భాగస్వామి అయినంత మాత్రాన అంత ఎమోషన్ అవ్వాలా? ఏమిటో అలా.. ఈరోజు పూరి బర్త్ డే సందర్భంగా పూరి కనెక్ట్స్ తరపున దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న30 మందికి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతిఒక్కరికి 50000 ల చొప్పున 15 లక్షల ఆర్థికసాయం చేశారు.
ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోవడం మీడియాలో చర్చకు వచ్చింది. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక సారి పూరి గారు నేను కూర్చొని ఉన్నప్పుడు నీకో విషయం తెలుసా దాసరి గారు నా గురించి ఎంత పెద్ద మాట అన్నారో.. నా తరువాత పూరి జగన్నాధ్ గారు నా వారసుడు అన్నారు అని చాలా ఎమోషనల్ గా చెప్పారు. ఆరోజు నుండే నా మనసులో దాసరి గారు లాంటి ఒక లెజండరీ పర్సన్ పూరి గారికి ఇంత మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీస్ ని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం చేశాం.. అని ఛార్మి అన్నారు.
ప్రతి సంవత్సరం పూరి పుట్టిన రోజు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. పూరి మీ అందరి కోసం మంచి మెస్సేజ్ పంపారు అంటూ మెసేజ్ ని చదివి వినిపించారు ఛార్మి. నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చిన నష్టం వచ్చినా దానికోసం చావడమే దాని గెలుపు.. అన్నదే పూరి సందేశం. మొత్తానికి ఈ కార్యక్రమం ఆద్యంతం ఛార్మి ఇన్ సైడ్ నుంచి ఎంతో ఎమోషన్ అవ్వడం కనిపించింది. ఇస్మార్ట్ శంకర్ ముందు అసలు చేతిలో చిల్లి గవ్వ అయినా లేకుండానే పని మొదలు పెట్టామని ఛార్మి అన్నారు. డబ్బు పోగొట్టుకుని తీవ్ర కష్టంలో ఉన్నప్పుడు సక్సెస్ వచ్చిందని.. తెలిపారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ఇచ్చిన కిక్కు ఛార్మిలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక ఈ సినిమాకి ముందు రామ్ అసలు కథ గానీ ఇంకేదైనా కానీ అడగ కుండానే నటించేందుకు తనే వచ్చాడని ఛార్మి తెలిపారు.