Gallery

Home News లైగ‌ర్ నుండి స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చేసిన ఛార్మి.. రేపు ర‌చ్చ ర‌చ్చే..!

లైగ‌ర్ నుండి స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చేసిన ఛార్మి.. రేపు ర‌చ్చ ర‌చ్చే..!

విజ‌య్ దేవ‌రకొంద ప్ర‌ధాన పాత్ర‌లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లైగ‌ర్. మ‌గ పులి, ఆడ‌పులి సంతానంని లైగ‌ర్ అని పిలుస్తాం. ఈ టైటిల్‌ని పూరీ జ‌గ‌న్నాథ్ త‌న సినిమాకు ఫిక్స్ చేశారు. కొద్ది రోజుల క్రితం చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈ పోస్ట‌ర్ నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. పోస్ట‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని చూసిన ఫ్యాన్స్ కు పూన‌కాలు వ‌చ్చేశాయి. సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆస‌క్తిగా ఎదురు చూడ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో చిత్ర నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అన‌న్య పాండే క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

Liger | Telugu Rajyam

సోష‌ల్ మీడియాలో వీడియో విడుద‌ల చేస్తూ ఫిబ్ర‌వ‌రి 11 ఉద‌యం 8.14ని.ల‌కు లైగ‌ర్ మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రు ఆ టైంపై ఫోక‌స్ పెడుతున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోనం ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి పని చేస్తుండ‌డం విశేషం. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదల కానుంది.

లైగ‌ర్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌నున్నారు. ముంబైలో చిత్ర షూటింగ్ చేస్తుండ‌గా, ఇందులో ఫైటర్‌గా క‌నిపించ‌నున్నాడు విజ‌య్ . ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

- Advertisement -

Related Posts

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం...

ప్రచారం సరిపోదు.. నేరస్తులపై సీరియస్ ‘యాక్షన్’ వుండాల్సిందే

ఆంధ్రపదేశ్ రాజధాని (వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా) అమరావతి పరిధిలో అత్యంత హేయమైన ఘటన జరిగింది. ఓ యువతిపై, ఆమెకు కాబోయే భర్త సమక్షంలోనే లైంగిక దాడి జరిగింది. అదీ, అమరావతిలో.....

Latest News